Saturday, May 3, 2025
- Advertisement -

చరిత్ర సృష్టించిన పాక్ బౌలర్‌

- Advertisement -

ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ బౌలర్ చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌ వేసిన పాక్ స్పిన్న‌ర్ నొమ‌న్ అలీ తొలి బంతికి జస్టిన్‌ గ్రీవ్స్‌(1), రెండో బంతికి టెవిన్‌ ఇమ్లాచ్‌(0), మూడో బంతిని కెవిన్‌ సిన్‌క్లెయిర్‌(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు.

ఇలా టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి పాకిస్థాన్ స్పిన్న‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. వెస్టిండీస్‌తో ప్రారంభ‌మైన రెండో టెస్టు మ్యాచులో అలీ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా పాకిస్థాన్ త‌రుపున టెస్టుల్లో హాట్రిక్ సాధించిన ఐదో బౌల‌ర్‌గా నిలిచాడు.

అలీ కంటే ముందు వసీం అక్రమ్‌ – 1999లో శ్రీలంకపై – లాహోర్ వేదిక‌గా, వసీం అక్రమ్ – 1999లో శ్రీలంకపై – ఢాకా వేదిక‌గా, అబ్దుల్‌ రజాక్ – 2000లో శ్రీలంకపై – గాలే వేదికగా,నసీం షా – 2020లో బంగ్లాదేశ్‌పై – రావల్పిండి వేదికగా,నొమన్‌ అలీ – 2025లో వెస్టిండీస్ పై – ముల్తాన్‌ వేదికగా హ్యాట్రిక్ తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -