Friday, May 17, 2024
- Advertisement -

నేటితో స‌చిన్‌కు 28 సంవ‌త్స‌రాలు..

- Advertisement -

క్రికెట్ దేవుడు అంటె అంద‌రికి ట‌క్కున గుర్తు కొచ్చేది మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్ క‌ర్‌. స‌చిన్ సాధించిన రికార్డులు ఎంత చెప్పుకున్నా త‌క్కువే. అభిమానుల‌కు ఆరాద్య‌దైవం స‌చిన్‌. గ్రౌండ్‌లోకి అడుగుపెడ్తే చాలు స్టేడియం అంతా స‌చిన్ పేరుతో మారుమ్రోగుతుంది. అలాంటి క్రికెట్ దేవుడు స‌చిన్‌కి ఈరోజు స్పెష‌లే అని చెప్పాలి.

సరిగ్గా 28 ఏళ్ల క్రితం ఇదే రోజున (1989, నవంబర్‌ 15) క్రికెట్‌ దేవుడు సచిన్ మొద‌టి సారి టెస్టు అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో చేసింది తక్కువ పరుగులే ఐనా ఆ తర్వాత అతను తిరగరాసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ‘రికార్డులంటే సచిన్‌.. సచిన్‌ అంటే రికార్డులు’ అన్నంతగా పరిస్థితి మారిపోయింది. కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.

స‌చిన్ తొలిటెస్ట్ కరాచీలో నవంబర్‌ 15న ప్రారంభమైంది. ఇదే మ్యాచ్‌లో చురకత్తుల్లాంటి బంతులు విసిరే వకార్‌ యూనిస్‌ అరంగేట్రం చేశాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 409 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి ఇమ్రాన్‌ఖాన్‌ (109 నాటౌట్‌) శతకంతో చెలరేగాడు.

బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ 262 పరుగులే చేసింది. 41 పరుగులకే 4 వికెట్లు నష్టపోయిన స్థితిలో సచిన్‌ కదనరంగంలోకి అడుగు పెట్టాడు. 24 బంతులాడిన స‌చిన్ 15 పరుగులు చేశాడు. అందులో రెండు సొగసైన కవర్‌డ్రైవ్‌లు ఉన్నాయి. వకార్‌ యూనిస్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో తెందుల్కర్‌ పెవిలియన్‌ చేరాడు. త‌ర్వాత స‌చిన్ ఎలాంటి రికార్డులు సాధించారో తెలిసిందే. వేల పరుగులు ఎన్నో రికార్డులు, అవార్డులు అందుకున్న క్రికెట్‌ దేవుడి స‌చిన్ ప్రస్థానం ఇలా మొదలైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -