Monday, April 29, 2024
- Advertisement -

T20 WORLDCUP :సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. సచిన్ క్లారిటీ ?

- Advertisement -

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టి20 ప్రపంచ కప్ ఎట్టకేలకు ఈ నెల 16 ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక అసలైన క్రికెట్ మజా ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది సూపర్ 12 లో పోటీ పడేందుకు చిరకాల ప్రత్యర్థులు ఇండియా పాకిస్తాన్ తొలి మ్యాచ్ లో తాలపడనున్నాయి. ఈ ఇరు జట్ల మద్య జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. నరాలు తెగే ఉత్కంఠ.. క్షణక్షణం చేతులు మరే విజయం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మ్యాచ్ లో ఉండే క్రికెట్ మజా అంతా ఇంతా కాదు. ఇక పోతే గత వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా విరాట్ కోహ్లీ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా ఎవరు ఊహించని విధంగా లీగ్ దశలోనే నిష్క్రమించింది. .

దాంతో ఆ పరాభవాన్ని మర్చిపోయేలా ఈ సారి టి20 వరల్డ్ కప్ సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది.ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ సారథ్యంలో జట్టు అన్నీ విభాగాల్లోనూ పటిష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలో కప్పు సాధించడం పెద్ద విషయమేమి కాదు. అయితే టీమిండియాతో పాటు మరో ఐదు దేశాలు కూడా దుర్భేద్యమైన లైనప్ తో ఉన్నాయి. దీంతో టీమిండియాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఈ వరల్డ్ కప్ లో సెమీస్ చేరే టాప్-4 జట్లను అంచనా వేశాడు. ఇండియాపాటు పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్ చేరే అవకాశం ఉందని సచిన్ ఇటీవల ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు.

వీటితో పాటు న్యూజిలాండ్ జట్టును కూడా తక్కువగా అంచనా వేయడానికి లేదని, అలాగే సౌతాఫ్రికా కూడా గట్టిగా ప్రయత్నిస్తే సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయని సచిన్ చెప్పుకొచ్చాడు. అయితే తను మాత్రం టీమిండియా కప్పు సాధించాలని బలంగా కోరుకుంటున్నట్లు సచిన్ చెప్పుకొచ్చాడు. అయితే గత టి20 వరల్డ్ కప్ సమయంలో కూడా పటిష్టంగా ఉన్న ఇండియా కప్ గెలిచే అవకాశాలు బలం ఉన్నాయని మాజీలు గట్టిగానే నొక్కి చెప్పారు. తీరా చూస్తే టీమిండియా సెమీస్ కూడా వెళ్లకుండా టోర్నీ నించి నిష్క్రమించింది. మరి ఈసారి ఎలా రాణిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -