Tuesday, May 21, 2024
- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్‌ ప్రకటించిన దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు…

- Advertisement -

దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సఫారీ జట్టు‌లో గత 15 ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన ఈ 36 ఏళ్ల ఓపెనర్.. అంతర్జాతీయ క్రికెట్‌‌‌ నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించాడు. ఐపీఎల్‌ లాంటి ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో మాత్రం కొనసాగుతానని వెల్లడించాడు.

భారత్ తో ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా 2004లో జరిగిన టెస్టు సిరీస్‌తో దక్షిణాఫ్రికా జట్టులోకి అరంగేట్రం చేసిన ఆమ్లా..తొలి 3 టెస్టుల్లో కలిపి 62 పరుగులే చేయడంతో జట్టులో చోటు కోల్పోయాడు. యితే 15 నెలల తర్వాత తిరిగి వచ్చి కివీస్‌పై భారీ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత కూడా కొంత తడబడ్డా 2007లో వరుసగా రెండు టెస్టుల్లో శతకాలు బాదడంతో అతనికి ఎదురు లేకుండా పోయింది.

శైలిపరంగా చూస్తే టెస్టు క్రికెట్‌ కోసమే పుట్టినట్లుగా అనిపించినా…వన్డేల్లోనూ ఆమ్లాకు అద్భుతమైన రికార్డు ఉంది. 2010లో విండీస్‌పై ఐదు వన్డేల సిరీస్‌లో 402 పరుగులు చేయడంతో అతని వన్డే సత్తా బయటపడింది. కెరీర్‌లో 124 టెస్టు మ్యాచ్‌లాడిన హసీమ్ ఆమ్లా.. 46.41 సగటుతో 9,282 పరుగులు చేశాడు. ఇందులో 28 శతకాలు ఉండగా.. నాలుగు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.181 వన్డేలాడిన 8,113 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు ఉన్నాయి. ఆఖరిగా 44 టీ20ల్లో 8 అర్ధశతకాలు సాధించి 1277 పరుగులు చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -