Friday, April 26, 2024
- Advertisement -

ఈ సారి సఫారీలతో.. అంతా ఈజీ కాదు !

- Advertisement -

ఐసీసీ టోర్నీలలో టీమిండియా కాస్త తడబడుతున్నప్పటికి.. ద్వైపాక్షిక సిరీస్ లలో మాత్రం మెరుగ్గానే రానిస్తోంది. ఆసియా కప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా ఎవరు ఊహించని విధంగా సూపర్ 4 లో నిష్క్రమించింది. ఇక ఆసియా కప్ ఇచ్చిన చేదు అనుభవాన్ని మరిచిపోయిలా తరువాత ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ ల టి20 సిరిస్ లో టీమిండియా విజయం సాధించింది. ఆసీస్ పై 2-1 తేడాతో సిరీస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సిరీస్ అలా ముగిసిందో లేదో వెంటేనే సౌత్ ఆఫ్రికా తో మరో వార్ కు సిద్దమైంది.

ఈ నెల 28 నుంచి స్వదేశంలో రోహిత్ సేన సఫారీలతో మూడు వన్డేలు, మూడు టీ20లు అడనుంది. టీ20 ప్రపంచ కప్ కు ముందు భారత్ ఆడుతున్న చివరి ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడం గమనార్హం. స్వదేశంలో సఫారిలను ఓడించి టీ20 వరల్డ్ కప్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని రోహిత్ సేన భావిస్తోంది. అయితే సఫారిలను ఓడించడం అంతా ఈజీ కాదు.. ఇప్పటివరకు 2015,2019,2022 లలో సౌతాఫ్రికా జట్టు భారత్ లో పర్యటించింది. స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లను మట్టికరిపించిన టీమిండియా సౌత్ ఆఫ్రికాపై మాత్రం ఒక్క టీ20 సిరీస్ కూడా నెగ్గలేకపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా సఫారిలపై పై చేయి సాధించాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. ఇక ప్రస్తుతం టీమిండియా అటాకింగ్ మోడ్ లో అన్నీ విభాగాల్లోనూ మెరుగ్గానే ఉంది.

అయితే ఎటొచ్చీ కాస్త బౌలింగ్ పై మరింత పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆసియా కప్ లోనూ ఆస్ట్రేలియా సిరీస్ లోనూ ముఖ్యంగా ఫెళవ బౌలింగ్ నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయితే బుమ్రా రాకతో టీమిండియా ఫేస్ దళం కాస్త బలపడిందనే చెప్పాలి.. ఇక ఈ నెల 28న ప్రారంభం కానున్న మొదటి టీ20 మ్యాచ్ త్రివేండంలో జరగనుంది. అయితే ఈ టీ20 సిరీస్ కు భువనేశ్వర్ కుమార్, హర్ధిక్ పాండ్య విశ్రాంతి తీసుకొనున్నారు. మరి టీ20 వరల్డ్ కప్ కు ముందు జరుగుతున్నా ఈ సిరీస్ లో విజయం కోసం ఇరు జట్లు గట్టిగానే పోటీపడే అవకాశం ఉంది. మరి టీమిండియా సఫారిలను ఎంతమేర ఎదుర్కొంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -