Thursday, May 9, 2024
- Advertisement -

హర్షదీప్ మ్యాజిక్.. సూర్య ఎటాక్

- Advertisement -

స్వదేశంలో సౌతాఫ్రికా తో జరుగుతున్నా మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో నిన్న తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ బోణి కొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ విభాగాల్లోనూ సమిష్టిగా రాణించి సఫారిలపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ సేన సఫారిలను తక్కువ స్కోర్ కే కట్టడి చేయడంలో సక్సస్ సాధించింది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ లో కేశవ మహారాజ్ 35 బంతుల్లో 45 పరుగులు, మార్కరమ్ 24 బంతుల్లో 25 పరుగులు, పార్నల్ 37 బంతుల్లో 24 పరుగులు చేయగా మిగిలిన బ్యాట్స్ మెన్స్ టీమిండియా బౌలింగ్ దాటికి నిలువలేకపోయారు. దాంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 107 పరుగుల అత్యల్ప స్కోర్ కే పరిమితం అయ్యారు. టీమిండియా బౌలర్స్ లో హర్షదీప్ సింగ్ ఏకంగా మూడు కీలక వికెట్లు తీసి సఫారిల పతనాన్ని శాసించాడు.

ఇక 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలో కాస్త తడబాటుకు గురైంది. కెప్టెన్ రోహిత్ శర్మా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక తరువాత వచ్చిన విరాట్ కోహ్లీ తో కలిసి మరో ఓపెనర్ కే‌ఎల్ రాహుల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డ్ ను ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా పవర్ ప్లే లో కేవలం 17/1 పరుగులు మాత్రమే చేసింది. టి20 లలో పవర్ ప్లే లో టీమిండియా చేసిన అత్యల్ప స్కోర్ ఇదే కావడం గమనార్హం. ఇక విరాట్ కోహ్లీ కూడా కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత వచ్చిన యువ సంచలనం సూర్య కుమార్ యాదవ్ దాటిగా ఆడుతూ విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ 33 బంతుల్లో 50 పరుగులు చేయగా, కే‌ఎల్ రాహుల్ 56 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ విధంగా ఇద్దరు హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా 16.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో టీమిండియా 1-0 తో ఆధిక్యంలో నిలిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -