Wednesday, May 1, 2024
- Advertisement -

టీమిండియా ను భయపెడుతున్న డెత్ ఓవర్స్ !

- Advertisement -

ప్రస్తుతం టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన రెండు టి20 మ్యాచ్ లలో కూడా అద్భుత విజయాన్ని నమోదు చేసింది టీమిండియా. నేడు చివరి టి20 మ్యాచ్ కు సిద్దమయ్యాయి ఇరు జట్లు. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ తో భారత్ క్లీన్ స్వీప్ పై కన్నేయగా.. కనీసం చివరి మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది సౌతాఫ్రికా. ఇక ఆల్రెడీ సిరీస్ కైవసం కావడంతో టీమిండియా ప్రధాన ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్ లో రాణించిన కోహ్లీ, కే‌ఎల్ రాహుల్ కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు క్రీడా సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. .

కోహ్లీ కి బదులుగా శ్రేయస్ అయ్యర్ బరిలోకి డిగనున్నాడు. ఇక రాహుల్ బదులుగా రిషబ్ పంత్ ఓపెనర్ గా వచ్చే అవకాశం ఉంది. టీమిండియా బ్యాటింగ్ విభాగంలో అత్యంత పటిష్టంగా ఉన్నప్పటికి బౌలింగ్ విభాగంలో తేలిపోతోంది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులను సమర్పించుకుంటుంది. ప్రస్తుతం ఈ సమస్యనే టీమిండియాను అధికంగా వేదిస్తోందని చెప్పవచ్చు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా పేరున్న బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరమవ్వడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే బౌలర్ కొరత టీమిండియాలో స్పష్టంగా కనిపిస్తోంది. అర్షదీప్ సింగ్ కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నప్పటికి అనుకున్న స్థాయిలో రాణించడంలేదు.

ఇక డెత్ ఓవర్లలో టీమిండియా విఫలం కావడాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రస్తావించాడు. ” డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు ఎక్కువగా పరుగులిస్తున్నారని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ” హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా గత ఐదారు మ్యాచ్ లలో ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ సరిగా చేయలేదని, ఈ అంశమే తనకు సవాల్ గా మారిందని చెప్పుకొచ్చారు. మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేవి డెత్ ఓవర్లేనని, అందుకే డెత్ ఓవర్ల లోపాన్ని సమిష్టిగా అధిగమిస్తామని రోహిత్ చెప్పుకొచ్చారు. మరి టి20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా డెత్ ఓవర్లలో తేలిపోవడం నిజంగా టీమిండియాకు కాస్త ప్రతికూల అంశమే. మరి ఈ డెత్ ఓవర్ల లోపాన్ని టీమిండియా ఎలా అధిగమిస్తుందో చూడాలి.

Also Read: టుడే స్పెషల్ : మీరు ఒడ్కా తాగుతారా.. ఈ రోజు మీకోసమే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -