ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ కైవ‌సం….

Srikanth Beats Olympic Champion Chen Long to Win Australian Open Superseries Final

సహచరులు విఫలమైన చోట.. స్టార్లందరూ వెనుదిరిగిన చోట.. ఒక్కడిగా గెలుస్తూ.. నిలుస్తూ వచ్చిన భారత బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఒలింపిక్ ఛాంపియన్, చైనా ఆటగాడు చెన్ లాంగ్‌తో తలపడ్డ శ్రీకాంత్ ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్ టైటిల్‌ను అందుకుని కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.
శ్రీకాంత్‌, చెన్‌లాంగ్‌ల మధ్య తొలి గేమ్‌ పోరు హోరాహోరీగా సాగింది. 14-14, 15-15, 20-20.. ఇలా ఆట నువ్వా నేనా అన్నట్లు సాగింది. చివర్లో తనదైన షాట్లతో కిదాంబి విజృంభించి ఆడి 22-20తో ఆధిక్యం సంపాదించి తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు. అనంతరం సాగిన రెండో గేమ్‌లో ఆది నుంచి కిదాంబి ఆధిపత్యం కొనసాగించాడు. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా 21-16తో రెండో గేమ్‌తోపాటు టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు.
అంతకుముందు వీరిద్దరూ ఐదుసార్లు తలపడిన ముఖాముఖి పోరులో చెన్ లాంగ్ నే పైచేయి సాధించాడు. కాగా, కొంతకాలంగా సూపర్ ఫామ్లో ఉన్న శ్రీకాంత్.. లాంగ్ పై ఉన్న ఆ రికార్డుకు ఫుల్ స్టాప్ పెట్టాడు.

{loadmodule mod_custom,GA1}

2001లో బ్యాడ్మింటన్‌ బ్యాట్‌ చేతబట్టిన శ్రీకాంత్‌ అంచలంచెలుగా ఎదిగి ఎన్నో విజయాలు సాధించి ప్రపంచస్థాయి పోటీల్లో తలపడేస్థాయికి ఎదిగారు. హైదరాబాద్‌లోని గోపీచంద్‌ అకాడమీలో చేరాక శ్రీకాంత్‌ ఆట మరింత రాటుదేలింది. 2012లో మాల్దీవుల్లో జరిగిన ఇంటర్నేషనల్ ఛాలెంజ్ టోర్నీలో టైటిల్‌ను సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీకాంత్‌ ఆ తర్వాత ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. 2013లో థాయ్‌లాండ్‌ గ్రాండ్‌ ప్రీ గోల్డ్‌ సింగిల్స్‌లో విన్నర్‌గా నిలిచారు. 2014 చైనా ఓపెన్‌ సిరీస్‌, 2015లో ఇండియా ఓపెన్‌ సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. 2016 ఒలింపిక్స్‌లో క్వార్టర్‌ పైనల్స్‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

{loadmodule mod_custom,GA2}

Also read

  1. మీరు ఎప్ప‌డూ చూడ‌ని కొత్త క్రికెట్‌….
  2. శ్రీలంక ప‌ర్య‌ట‌న‌ ఖ‌రారు….
  3. భ‌విష్య‌త్తులో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫి లేన‌ట్లే……?
  4. విరాట్‌ కోహ్లి ఔట్ కావడానికి కారణం ఏంటి..?