Friday, May 10, 2024
- Advertisement -

శ్రీలంక ప‌ర్య‌ట‌న‌ ఖ‌రారు….

- Advertisement -
Schedule of India’s tour of Sri Lanka 2017

భారత్ మూడు నెలల పాటు ఎడతెరపి లేని క్రికెట్ ఆడనుంది. వెస్టిండీస్ పర్యటన కోసం ఇప్పటికే కరీబియన్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా.. అక్కడ సిరీస్ ముగిసిన అనంతరం శ్రీలంక‌కి వెళ్లనుంది. అక్కడ లంకేయులతో మూడు టెస్టులు, ఐదు వన్డేలతో పాటు ఒక టీ20 మ్యాచ్‌ ఆడనుంది.

వెస్టిండీస్‌ పర్యటన అనంతరం 10 రోజుల విరామం తర్వాత భారత్‌… శ్రీలంకలో పర్యటించనుంది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టుతో భారత్‌ 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. జులై 26 నుంచి సెప్టెంబరు 6 మధ్య ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. అంతకుముందు భారత్‌ రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడనుంది.

{loadmodule mod_custom,GA1}

ప్రపంచకప్ 2019కి నేరుగా అర్హత సాధించాలని ఆశిస్తున్న వెస్టిండీస్‌ జట్టుతో భారత్ జూన్ 23 నుంచి ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే వన్డే ర్యాంకింగ్ మెరుగ్గా లేకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీపడే అవకాశాన్ని చేజార్చుకున్న కరీబియన్లు.. టీమిండియాపై వన్డే సిరీస్ గెలవాలని పట్టుదలతో ఉన్నారు.

షెడ్యూల్‌ వివరాలు
వార్మప్‌ మ్యాచ్‌లు: జులై 21, 22
టెస్టులు

మొదటి టెస్టు: జులై 26-30(క్యాండీ)
రెండో టెస్టు: ఆగస్టు 4-8(గాలే)
మూడో టెస్టు: ఆగస్టు 12-16(కొలంబో)

{loadmodule mod_custom,GA2}

వన్డేలు
తొలి వన్డే: ఆగస్టు 20
రెండో వన్డే: ఆగస్టు 24
మూడో వన్డే: ఆగస్టు 27
నాలుగో వన్డే: ఆగస్టు 30
ఐదో వన్డే: సెప్టెంబరు 3
ఏకైక టీ20: సెప్టెంబరు 6

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -