- Advertisement -

భ‌విష్య‌త్తులో ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫి లేన‌ట్లే……?

- Advertisement -
ICC could axe Champions Trophy for more T20 World Cups in future

నిజంగా క్రికెట్ అభిమానుల‌కు ఇదు చేదువార్తే.వ‌న్డే ఇంట‌ర్‌నేష‌న‌ల్ క్రికెట్‌కు ఎంత క్రేజీ ఉందో తెలిసిందే.వ‌రల్డ్ క‌ప్ త‌ర్వాత …ఐసీసీ నిర్వ‌హించే ఛాంపియ‌న్స్‌ట్రోఫీకి భారీ క్రేజీ ఉంది.నాలుగేళ్లకోసారి క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ భ‌విష్య‌త్తులో కనుమరుగు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి .

ప్ర‌స్తుతం ట్వంటీ 20ల ప్రభావంతో చాంపియన్స్ ట్రోఫీకి చెక్ ప‌డింద‌నే అనుకోవాలి. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతన్నిస్తున్నాయి. ఐసీసీ నిర్వహించే రెండు 50 ఓవర్ల టోర్నమెంట్లు వల్ల పెద్దగా ప్రయోజనం లేదనే అభిప్రాయాన్ని రిచర్డ్స్ సన్ తన మాటల ద్వారా వెల్లడించారు.
వలం నాలుగేళ్లకొకసారి జరిగే వన్డే వరల్డ్ కప్ ను మాత్రమే కొనసాగించాలనుకుంటున్నట్లు ఆయన సూచాయగా పేర్కొన్నారు. భవిష్యత్తులో 16 నుంచి 20 జట్లు వరకూ క్రికెట్ ఆడే అవకాశం ఉండటంతో అది ట్వంటీ 20ల ద్వారానే సాధ్యమవుతుందని రిచర్డ్స్ సన్ పేర్కొన్నారు.

{loadmodule mod_custom,GA1}

చాంపియన్స్ ట్రోఫీని రద్దు చేసి.. ఆ టోర్నీ జరిగే కాలంలో రెండు వరల్డ్ ట్వంటీ 20లను నిర్వహించాలనేది ఆయన మాటల్లో ఉద్దేశంగా కనబడుతోంది. వరల్డ్ ట్వంటీ 20 టోర్నీలకు అన్ని రకాలుగా విపరీతమైన క్రేజ్ ఉండటమే ఇందుకు ప్రధానం కారణం. మరొకవైపు ఎక్కువ జట్లకు క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలనేది కూడా ఐసీసీ ఉద్దేశంగా క‌నిపిస్తోంది.
ఐసీసీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం తదుపరి చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఒకవేళ ఈ టోర్నమెంట్ ను రద్దు చేసిన పక్షంలో ఆ స్థానంలో ట్వంటీ 20 వరల్డ్ కప్ లు మాత్రమే మనకు కనువిందు చేస్తాయి.

{loadmodule mod_custom,GA2}

Also read

  1. కోహ్లీని అంత‌ర్జాతీయ క్రికెట్‌నుంచి బ‌హిస్క‌రించాలి…
  2. విరాట్‌ కోహ్లి ఔట్ కావడానికి కారణం ఏంటి..?
  3. బంగ్లాపై 9 వికెట్ట తేడాతో ఘ‌న‌విజయం సాధించిన ఇండియా… ఫైన‌ల్లో విరాట్ సేన‌
  4. వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్ ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించిన ఐసీసీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -