ఆస్ట్రేలియాలో జరుగుతున్నా టి20 వరల్డ్ కప్ లో నిన్న మొన్నటి వరకు క్వాలిఫైర్ మ్యాచ్ లతో కాస్త చప్పగానే సాగింది. ఆరు రోజులపాటు జరిగిన ఈ క్వాలిఫైర్ మ్యాచ్ లలో ఎనిమిది జట్లు పోటీపడగా నాలుగు జట్లు సూపర్ 12 కు అర్హత సాధించాయి. ఇక నిన్నటితో క్వాలిఫైర్ మ్యాచ్ లు ముగియడంతో నేటి నుంచి అసలైన టి20 యుద్దం మొదలుకానుంది. సూపర్ 12 లో పోటీ పడేందుకు ఏ మరియు బి గ్రూపులనుంచి ఆరేసి జట్లు బరిలో దిగనున్నాయి. గ్రూప్-ఏ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్ఘానిస్తాన్, శ్రీలంక, ఐర్లాండ్ జట్లు ఉండగా, గ్రూప్-బి లో భారత్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్యే, నెదర్లాండ్ వంటి దేశాలు ఉన్నాయి.
ఇక సూపర్ 12 తొలిమ్యాచ్ లో గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు నేడు తలపడనున్నాయి. ఇక యావత్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న.. ఇండియా వర్సస్ పాకిస్తాన్ మ్యాచ్ రేపు మెల్బోర్న్ వేదికగా జరగనుంది. ఈ దాయాదుల పోరుతో టి20 అసలైన క్రికెట్ మజా రేపు మొదలు కానుందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరు జట్లు కూడా అత్యంత పటిష్టంగానే ఉన్నాయి. ఇక గత వరల్డ్ కప్ లోనూ ఇటీవల జరిగిన ఆసియా కప్ లోనూ భారత్ కు పరాభవమే ఎరుదైంది. దాంతో ఈ సారి పాక్ పై పైచేయి సాధించాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది.
అయితే టీమిండియా కూడా అత్యంత పటిష్టమైన జట్టుగా ఉన్నప్పటికి పాక్ ను ఏదశలోనూ తక్కువగా అంచనా వేయకూడదని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పాక్ ఆటగాళ్లలో కెప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వన్, ఫాకర్ జమన్, హైదిర్ అలీ, వంటి ఆటగాళ్లు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇక పాక్ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఫేస్ విభాగంలో అత్యంత పటిష్టంగా ఉంది పాక్ జట్టు. ఈ మద్యనే గాయం నుంచి కోలుకున్న షాహిన్ అఫ్రిది తిరిగి జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆ జట్టు బౌలింగ్ దళం మరింత బలంగా మారింది. ఈ నేపథ్యంలో పాన్ ను తక్కువగా అంచనా వేస్తే రోహిత్ సేన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని మాజీలు సైతం హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
టీ20 వరల్డ్ కప్ కు టాటా చెప్పిన వెస్టిండీస్ .. కారణం అదే !