Friday, April 26, 2024
- Advertisement -

కేంద్ర బడ్జెట్ 2021: సీనియర్‌ సిటిజన్లకు శుభవార్త

- Advertisement -

లోక్‌సభలో కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సీనియర్‌ సిటిజన్లకు భారీ ఊరట కల్పించారు. 75ఏళ్లు పైబడిన పెన్షనర్లకు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక ఎన్ఆర్ఐలకు డబుల్ ట్యాక్సేషన్ నుంచి ఊరట కల్పిస్తామన్నారు. పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

కేంద్రం నిర్ణయంతో 75 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఐటీ రిటర్స్ దాఖలు చేయడం నుంచి మినహాయింపు వర్తిస్తుంది. అలాగే చిన్న ట్యాక్స్ పేయర్ల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ప్యానల్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.50లక్షలలోపు ఆదాయం, రూ.10లక్షలలోపు వివాదాలు ఉన్న వారు నేరుగా కమిటీ అప్పీలు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

పన్ను వివాదాల స్పందన కాల పరిమితి 6 నుంచి మూడేళ్లకు తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఈసారి బడ్జెట్‌లో ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో 2021-22 బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఆదాయపన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఏపీపై సవతి ప్రేమ.. ఇది కేంద్ర బడ్జెట్ కాదు

పవర్ స్టార్ మూవీకి అంత డిమాండ్ చేసిందా?

సూపర్‌ స్టార్‌తో చిందులేసేందుకు రెడీ అయిన బిగ్‌బాస్‌ బ్యూటి

మెగాస్టార్ చిరంజీవి వదిలేసిన సినిమాలు ఇవే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -