Saturday, April 27, 2024
- Advertisement -

ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్‌!

- Advertisement -

ఐపీఎల్ ప్రేమికుల‌కు బీసీసీఐ శుభ‌వార్త చెప్పింది. వ‌చ్చే సీజ‌న్‌ను భార‌త్‌లోనే నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్ట‌మైన‌ సంకేతాలు ఇచ్చింది. ఈ విష‌యం గురించి తాము ఇప్ప‌టికే కీల‌క అంశాల‌పై చ‌ర్చిస్తున్నామ‌ని బీసీసీఐ సెక్ర‌ట‌రీ అరుణ్ ధ‌మాల్ తెలిపారు. త‌ప్ప‌నిస‌రి అనుకుంటే ఆట‌గాళ్లంద‌రికీ క‌రోనా వ్యాక్సిన్ వేయించే ఆలోచ‌న‌లో కూడా ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

కాగా కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఐపీఎల్-2020 సీజ‌న్‌ను యూఏఈలో నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. బ‌యోబ‌బుల్‌లో ఆట‌గాళ్ల‌ను ఉంచి ప్రేక్ష‌కులు లేకుండానే స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వ‌హించారు. అంతేగాక మార్చి చివ‌రి వారంలో మొదలు కావాల్సిన సీజన్-13ను తొలుత వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్‌-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యం పడలేదు. దీంతో వేదిక‌ను యూఏఈకి మార్చారు.

ఈ క్ర‌మంలో సెప్టెంబ‌రు 19 నుంచి నవంబరు 10 వరకు కొనసాగిన టోర్నీ జ‌రిగింది. ఇక కొన్ని రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డం, వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు మార్గం సుగ‌మ‌మైంది. దీంతో ఇక్క‌డే ఈ మెగా ఈవెంట్‌ను నిర్వ‌హించాల‌ని బీసీసీఐ భావిస్తోంది. ఇక గ‌త సీజ‌న్ వ‌ల్ల బీసీసీఐకి సుమారు 4 వేల కోట్ల రూపాయాల ఆదాయం వ‌చ్చింది.

బూటకపు ఎన్నికలను బహిష్కరించండి

భార్యకు కూడా తెలియకుండా ఆ పని చేసిన విజయ్ సేతుపతి!

నిమ్మగడ్డా… నువ్వు ఎర్రగడ్డకు వెళ్లాల..

పవన్‌ అప్పుడు టీడీపీ.. ఇప్పుడు బీజేపీ ని యాచిస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -