Saturday, May 18, 2024
- Advertisement -

ట్రోఫీని నేరుగా సిరాజ్ కు చేతికి ఇచ్చి హుందాత‌నాన్ని చాటుకున్న కోహ్లీ…

- Advertisement -

న్యూజిలాండ్ తో జ‌రిగిన టీ20 సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవ‌సం చేసుకున్న సంగ‌తి తెలిసిందె. ఈసిరీస్‌లో కోహ్లీసేన అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. మంగళవారం జరిగిన చివరి ట్వంటీ 20లో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకుంది. చివ‌రి మ్యాచ్ వ‌ర్షం కార‌నంగా జ‌రుగ‌తుందా లేదా అన్న సందేహం ఉండేది. చివ‌ర‌కు మ్యాచ్‌ను ఎనిమిది ఓవర్లకు కుదించబడ్డ మ్యాచ్ లో భారత్ కడవరకూ పోరాడి ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీ20లో కివీస్ పై తొలిసారి సిరీస్ ను భారత్ చేజిక్కించుకుంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం హైదరాబాద్ పేసర్ సిరాజ్ కు కెప్టెన్ విరాట్ కోహ్లి మరిచిపోలేని షాకిచ్చాడు. మ్యాచ్ తరువాత ట్రోఫీని నేరుగా సిరాజ్ కు చేతికి అందించి కోహ్లి తన హుందాతనాన్ని చాటుకున్నాడు.

ఇటీవల న్యూజిలాండ్ తో టీ 20 సిరీస్ లో భాగంగా రాజ్ కోట్ లో జరిగిన రెండో మ్యాచ్ ద్వారా సిరాజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా, చివరి టీ 20లో సిరాజ్ కు చోటు దక్కలేదు. తన తొలి మ్యాచ్ లో ధారాళంగా పరుగులిచ్చిన సిరాజ్ ను మూడో టీ 20కి విశ్రాంతినిచ్చారు.

అయితే మ్యాచ్ తరువాత మాత్రం కొత్త ఆటగాడైన సిరాజ్ కు ఊహించని షాకిచ్చి సంభ్రమాశ్చర్యానికి గురి చేశాడు కోహ్లి. భారత జట్టులోకొచ్చిన యువ క్రికెటర్లను ఇలా గౌరవించడం అనవాయితీగా మారింది. గతంలో ఎంఎస్ ధోని కెప్టెన్ గా చేసిన సమయంలో కూడా ఇలానే యువ క్రికెటర్లను ప్రోత్సహించేవాడు. ఇప్పుడు దాన్ని కోహ్లి కొనసాగిస్తూ మరొకసారి ధోనిని గుర్తు చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -