Sunday, April 28, 2024
- Advertisement -

తీరు మార్చుకోని రోహిత్ సేన..ఇలా అయితే కష్టమే !

- Advertisement -

గత కొన్ని రోజులుగా టీమిండియా వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. చిన్న జట్టు పెద్ద జట్టు అని తేడా లేకుండా ప్రతి జట్టు కూడా టీమిండియా పై ఆదిపత్యం చెలాయిస్తున్నాయి. ఆసియా కప్, టి20 వరల్డ్ కప్, న్యూజిలాండ్ వన్డే సిరీస్, ఇలా ప్రతి దాంట్లో కూడా టీమిండియా దారుణంగా చతికిల పడింది. అసలు ప్రపంచ క్రికెట్ లో తిరుగులేని జట్టుగా పేరు గాంచిన టీమిండియా ఇంత దారుణంగా విఫలం అవ్వడం ఏంటని అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డేలో కూడా టీమిండియా ఘోర ఓటమిని చవి చూసింది. అసలు గెలవాల్సిన మ్యాచ్ ను చేజెతులా ఆతిథ్య జట్టుకు అప్పగించింది. బంగ్లాదేశ్ తో 3 వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఈ రోజు తొలి వన్డే జరిగింది. మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్స్ ఘోరంగా విఫలం అయ్యారు.

కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 27 పరుగులు, శికర్ ధావన్ 17 బంతుల్లో 7 పరుగులు, విరాట్ కోహ్లీ 15 బంతుల్లో 9 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 39 పరుగులు మాత్రమే చేయగా, కే‌ఎల్ రాహుల్ ఒక్కడే 70 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టును ఆడుకునే ప్రయత్నం చేశారు. ఇక బ్యాట్స్ మెన్స్ ఘోరంగా విఫలం కావడంతో 41.2 ఓవర్లలోనే రోహిత్ సేన ఆలౌట్ గా నిలిచి 186 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన బంగ్లా జట్టు కూడా తడబడుతూ నిలబడింది. లిట్టన్ దాస్ 41 పరుగులు, మెహిదీ హాసన్ 38 పరుగులు, షకీబ్ హాసన్ 29 పరుగులు చేసి జట్టును ఆడుకున్నారు. అయితే లక్ష్య చెదనలో బంగ్లా గెలవడం కష్టమే అని భావించిన క్రమంలో టీమిండియా ఫీల్డింగ్ లో చేసిన పొరపట్ల కారణంగా ఒక్క వికెట్ తేడాతో బంగ్లా బెబ్బులీలు 187 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించారు. దీంతో బంగ్లాదేశ్ 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండవ మ్యాచ్ ఈ నెల 7 న జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -