Sunday, April 28, 2024
- Advertisement -

రోహిత్ కెప్టెన్సీకి బైబై చెప్తే..రేస్ లో ఎవరున్నారంటే?

- Advertisement -

భారత అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఊహించని విధంగా ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో అద్భుతంగా రాణించిన రోహిత్ సేన సెమీస్ లో మాత్రం అత్యంత చెత్త ప్రదర్శనతో టోర్నీ నుంచి నిష్క్రమించి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక ఈ టి20 ప్రపంచ కప్ లక్ష్యంగా కెప్టెన్సీ బాద్యతలు చేపట్టిన రోహిత్.. తన కెప్టెన్సీ లో వచ్చిన ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ వంటి మేజర్ టోర్నమెంట్ లలో ఘోరంగా నిరాశ పరిచాడు. అటు కెప్టెన్ గాను ఇటు బ్యాట్స్ మెన్ గాను దారుణంగా విఫలం అవుతూ, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఒక విధంగా చెప్పాలంటే వరల్డ్ కప్ సెమీస్ లో రోహిత్ సరైన వ్యూహాలు రచించలేదని, రోహిత్ కెప్టెన్ గా కాకుండా కేవలం ప్రేక్షక పాత్ర పోషించడాని, భారత మాజీ పెసర్ అతుల్ వాసన్ అభిప్రాయ పడ్డాడు. ఇక బీసీసీఐ మేనేజ్మెంట్ కూడా జట్టును పూర్తి ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేసే అవకాశం ఉన్నట్లు కూడా క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశం ఉందనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. ఒకవేళ రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. రేస్ లో ఎవరెవరు ఉంటారు అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.. రోహిత్ తర్వాత ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా కే‌ఎల్ రాహుల్ ఉన్నాడు.

అయితే రాహుల్ కన్నా.. రిషబ్ పంత్, లేదా హర్ధిక్ పాండ్య కెప్టెన్ గా అర్హులని, వారిద్దరికి కెప్టెన్సీ బాద్యతలను సమర్థవంతంగా నడిపించే సత్తా ఉందని కొందరు మాజీలు చెబుతున్నారు. ఇక వీరినే కాకుండా విరాట్ కోహ్లీకి మళ్ళీ కెప్టెన్సీ బాద్యతలు అప్పగించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. గత టి20 వరల్డ్ కప్ తరువాత కోహ్లీ తన కెప్టెన్సీ కి బై బై చెప్పగా.. బీసీసీఐ వన్డే, టెస్ట్ ల నుంచి కూడా కోహ్లీని కెప్టెన్ గా తొలగించింది. దాంతో చాలా రోజులు కోహ్లీ బీసీసీఐ మద్య వార్ నడిచింది. మళ్ళీ ఇప్పుడు కోహ్లీని కెప్టెన్ చేయాలనే వాదన పెరిగిపోతుండడంతో కోహ్లీ కెప్టెన్ గా బాద్యతలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాడా లేదా అనేది అనుమానమే. ఏది ఏమైనప్పటికి టి20 వరల్డ్ కప్ తరువాత భారత జట్టులో సమూల మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -