Saturday, May 18, 2024
- Advertisement -

బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తూ పాక్ రాయబారికి సమన్లు

- Advertisement -
beheading of soldiers outraged india summons pak envoy

ఇద్దు భార‌త జ‌వాన్ల‌ను అతికిరాత‌కంగా చంపిన పాకిస్థాన్ పై భారత్ తీవ్ర నిరసన వ్య‌క్తంచేసింది.భారత జవాన్లను ఆటవికంగా హతమార్చినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ బుధవారం ఢిల్లీలో పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ బాసిత్ ను పిలిపించుకుని సమన్లు జరీచేశారు.

పాక్ సైనికులు, ఉగ్రవాదులు కలిసే.. భారత జవాన్ల తలలు నరికారని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని భారత్ పేర్కొంది. పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల సంయుక్తంగా బార్డర్ యాక్షన్ టీమ్(బ్యాట్) మే 1న భారత భూభాగంలోకి చొరబడి గస్తీ కాస్తోన్న ఇద్దరు జవాన్లను అతి కిరాతకంగా చంపేసిన ఘటన సంచలన రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా పాకిస్థాన్ చేసిన ఈ దురాగ‌తంపై నిర‌స‌న‌లు వెల్ల‌వెత్తాయి. అయితే వారు నడిచివెళ్లిన దారి వెంబడి కొన్ని రక్తపు నమూనాలు సేకరించామని, హత్యకు గురైన సైనికుల రక్తనమూనాలతో అవి సరితూగాయని, దీన్నిబట్టి హంతకులు ముమ్మాటికీ పాక్ నుంచి వచ్చినవారేనని పాక్ రాయబారికి వివరించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

సుబేదార్ పరమ్ జీత్ సింగ్, బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ లు మే 1రాత్రి పూంఛ్ సెక్టార్ లో కమ్యూనికేషన్ కేబుల్స్ పరీక్షించే పనిలో ఉండగా వారిని పాకిస్థాన్ బ్యాట్ బృందం చుట్టుముట్టింద‌న్నారు. జవాన్లను దారుణంగా హతమార్చడమేకాక తలలు వేరుచేసి రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తించార‌న్నారు. తర్వాతి రోజు ఉదయానికిగానీ జవాన్ల మృతదేహాలను సహచరులు గుర్తించారు.

Related

  1. ఉత్త‌ర కొరియా దుందుడ‌కుతో అంత‌ర్జాతీయంగా ప‌రిస్థితులు ఉద్రిక్తం…..
  2. పాకిస్థాన్ చేతిలో చంప‌బ‌డిన అమ‌ర‌జ‌వాన్ కుటుంబాల డిమాండ్‌..
  3. ఆర్మీ జరిపిన కాలుపులో పాకిస్థాన్ కు చెందిన రెండు బంకర్లు ద్వంసం.. ఏడు సైనికులు మృతి
  4. ట్రంప్, పుతిన్‌లు సిరియా కంటే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తీరుపైనే ఎక్కువగా చర్చించినట్లు సమాచారం….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -