Sunday, May 19, 2024
- Advertisement -

పాకిస్థాన్ చేతిలో చంప‌బ‌డిన అమ‌ర‌జ‌వాన్ కుటుంబాల డిమాండ్‌..

- Advertisement -
want 50 pakistani heads for his sacrifice asks martyr prem sagar daughter

పాక్ చేస్తున్న దురాగతాలపై భారతీయులు మండిపడుతున్నారు. ఇప్పటికే యూరీ పటాన్ కోట్ అటాక్స్ తో రగులుతున్న భారతీయులు తాజగా పాకిస్థాన్ పాల్పడిన మరో దురాగతంపై తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. ఇప్ప‌టికే సోషియ‌ల్ మీడియాలో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి చావుదెబ్బ కొట్టాల‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి. భారత జవాన్ల తలలు నరికిన ఘటన పట్ల భారతీయుల రక్తం మరుగుతోంది. పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందేనంటూ దేశంలోని ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మరోవైపు పాక్ సైనికుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ కుమార్తె సరోజ్ కూడా పాక్ పై నిప్పులు చెరిగారు. తన తండ్రి త్యాగానికి బదులుగా 50 మంది పాకిస్థానీల తలలు తీసుకురావాలని అన్నారు. ఇదే దాడిలో మరణించిన మరో సైనికుడు పరమ్ జీత్ సింగ్ కుటుంబంకూడా పాకిస్థాన్‌తో యుద్ధం చేయడం ఒక్కటే సమస్యకు పరిష్కారమని అన్నారు. ‘భారత జవాన్లను అత్యంత కిరాతకంగా
హతమార్చిన పాక్‌ సైన్యంపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఒకేసారి యుద్ధం చేసి సమస్యను ముగించాల‌న్నారు.

‘పరమ్‌జీత్‌సింగ్‌ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. మే 10న ఇంట్లోకి మారనున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా తారుమారైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయన మృతదేహాన్ని ఆ ఇంట్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆయన్ని చూస్తే చాలా గర్వంగా ఉంద‌న్నారు.‘నా తండ్రి అమరవీరుడైనందుకు చాలా గర్వంగా ఉంద‌ని… దేశం కోసం ప్రాణత్యాగం చేశారు’ అని పరమ్‌జీత్‌సింగ్‌ కుమార్తె సిమరందీప్‌ అన్నారు. అంత్యక్రియల నిమిత్తం అమరజవాను మృతదేహాన్ని ఆయన స్వస్థలానికి తీసుకొచ్చారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సోమవారం నియంత్రణ రేఖ వద్ద పాక్‌ సైన్యం దాడి చేసి ఇద్దరు భారత జవాన్లను పైశాచికంగా హతమార్చిన సంగతి తెలిసిందే. వారి తలలను మొండెం నుంచి వేరు చేసి కిరాతకంగా ప్రవర్తించారు. దీనికి బదులుగా భారత్‌ సోమవారం రాత్రి రెండు పాకిస్థాన్‌ బంకర్లను ధ్వంసం చేసి ఏడుగురు సైనికులను హతమార్చింది.

Related

  1. టీడీపీ లో అవమానాలు తట్టుకోలేక సొంత‌గూటికి వైసీపీ ఎమ్మెల్యేలు
  2. ఆర్మీ జరిపిన కాలుపులో పాకిస్థాన్ కు చెందిన రెండు బంకర్లు ద్వంసం.. ఏడు సైనికులు మృతి
  3. జగన్ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఎక్క‌డ బాబు…?
  4. లగడపాటి తాజా సర్వే.. 2019 లో టీడీపీకి డిపాజిట్లు గల్లంతు.. వైసీపీ ప్రభంజనం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -