Friday, May 17, 2024
- Advertisement -

స‌రిహ‌ద్దుల్లో డ్రాగ‌న్ దుస్సాహ‌సం..

- Advertisement -
Bharath strong warning to china…Chinese troops enter India via Sikkim sector

భార‌త్.చైనా స‌రిహ‌ద్దుల్లో రెండు రోజులుగా కొన‌సాగుతున్న‌ ఉద్రిక్త ప‌రిస్థితులు తారాస్థాయికి చేరాయి. మ‌రోసారి సరిహద్దుల్లో చైనా మరోమారు రెచ్చిపోయింది. మరోసారి చొరబాటుకు ప్రయత్నిస్తూ, వందలాది మంది సైన్యాన్ని సరిహద్దులు దాటించగా, వారు భారత్ లోని డోక్లాం ప్రాంతంలోకి చొచ్చుకు వచ్చారు.

దీనిపై తీవ్రంగా స్పందించిన సైన్యం వారిని అడ్డుకుంది. ఆ వెంటనే సమస్య తీవ్రతను తెలుసుకున్న కేంద్రం హెచ్చిరికలు జారీ చేసింది. హద్దుల్లో ఉండాలని చైనా రాయబార కార్యాలయానికి నోటీసులు పంపింది.
భారత్ కు నమ్మకమైన మిత్ర దేశంగా ఉన్న భూటాన్ కూడా ఈ విషయంలో మద్దతు పలికింది. చైనా అక్రమంగా సరిహద్దులు దాటుతోందని ఆరోపిస్తూ, చైనా సైనికులను అడ్డుకునేందుకు తమ సైన్యాన్ని రంగంలోకి దింపింది. డోక్లాం మూడు దేశాలకు కూడలి వంటిది. ఇది భూటాన్‌ భూభాగం అయినప్పటికీ చైనా నియంత్రణలో ఉంది.

{loadmodule mod_custom,GA1}

సరిహద్దుల్లో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు భారత ఆర్మీ చీఫ్ రావత్ గురువారంనాడు గ్యాంగ్‌టక్‌లోని 17 మౌంటెన్ డివిజన్ హెడ్‌క్వార్టర్స్, కలింపాంగ్‌లోని 27 మౌంటైన్ డివిజన్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా 17 డివిజన్‌కు చెందిన బలగాలతో రావత్ సమావేశమై బలగాల మోహరింపుపై దృష్టిసారించారు.

Related

  1. ఆర్మీఛీప్ సిక్కింప‌ర్య‌ట‌న‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…
  2. ఎదురుతిరిగి దాడి చేస్తే ఎలా ఉంటుందో పాక్‌కు రుచి చూపించింన భార‌త్‌ ఆర్మీ
  3. స‌రిహ‌ద్దుల్లో పాక్ శిభిరాల‌ను పూర్తిగా ధ్వంసం చేసిన సైనిక ద‌ళాలు
  4. పాక్ ఉగ్ర‌వాద దాస్ప్ర‌చారాన్ని కాశ్మీర్ యువ‌త తిప్పికొట్టాలి ఆర్మీ ఛీప్ రావ‌త్‌…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -