Thursday, May 2, 2024
- Advertisement -

కేటీఆర్ చేయలేనిది లోకేష్ చేయగలడా…!

- Advertisement -
Kushboo in Pawan Kalyan and Trivikram Film

తెలుగు రాష్ట్రాల  రాజ‌కీయాల‌ను శాసిస్తున్న ఇద్ద‌రు సీఎంల  కుమారులు భావినేత‌లు… భ‌విష్య‌త్ సార‌ధులు.ఒక‌రు ఇప్ప‌టికే రాజ‌కీయాల‌లో రాటుదేలారు…మ‌రొక‌రు ఇప్పుడిప్పుడే రాజ‌కీయాల‌ను ఒంట‌ప‌ట్టించుకుంటున్నారు.తెలుగు రాస్ట్రాల రాజ‌కీయాల‌ను ఇద్ద‌రు యువ‌నేత‌లు శాశిస్తారా!వారే ఒక‌రు తెలంగాణా సీఎం చంద్ర‌శేఖ‌ర్‌రావు కొడుకు కేటీఆర్ మ‌రొకు  ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కొడుకు లోకేష్‌.ఒక వైపు కేటీఆర్ రాజ‌కీయాల్లో దూసుకుపోతుంటే ఒక‌రేమో ఇప్పుడిప్పుడే అస‌లు సిస‌లైన రాజ‌కీయాల‌ల్లోకి అడుగుపెట్టారు.

తెలంగాణాలో కేటీఆర్ ఐటీ, పంచాయితీ రాజ్ లాంటి ముఖ్య‌శాఖ‌ల‌కు మంత్రిగా ఉంటూ ఈ శాఖ‌ల‌లో త‌న మార్కును చూపేడుతున్నారు. కేటీఆర్‌కు పోటీగా లోకేష్‌కు కూడా ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ‌ల‌ను బాబు కేటాయించారు. కేటీఆర్‌కు  రాజ‌కీయం, మంత్రిశాఖ‌ల‌ మీద పంచి ప‌ట్టు ఉంది. అదే విధంగా తెలంగాణా ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించ‌డంతోపాటు మాస్ పాలోయింగ్ ఉన్న‌నేత‌. ఇక లోకేష్ రాజ‌కీయాల‌కు కొత్త‌.. టిఆరెస్ పార్టీలకు తిరుగులేని నేతలుగా అవ‌కాశాలు పుస్క‌లంగా ఉన్నాయి. కేటీఆర్ లాగా త‌న మార్కును చూపిస్తారా అన్న సందేహాలు క‌లుగుతున్నాయి.

మ‌రి లోకేష్ కేటీఆర్‌లాగా నిలబడతారా? ఇద్దరిలోఉన్న ప్రత్యేకతలేంటి? చంద్రబాబు ఏకైక తనయుడుగా లోకేష్ కి తండ్రి రాజకీయ చతురత, వ్యూహం, ఎత్తుగడలు  లోకేష్ ఒంట‌ప‌ట్టించుకుంటార‌న్న సందేహాలు క‌లుగుతున్నాయి. లోకేష్ శాసన మండలిలోకి ఎంటరైన అతి పిన్న వయస్కుడు.. లోకేశ్ పార్టీ లో క్రియాశీలకంగా ఉంటున్నా.. చట్టసభలకు, మంత్రివర్గానికీ ఆయన కొత్త.. ఇప్పటికే పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్న లోకేశ్ కు హెరిటేజ్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించిన అర్హత ఉంది. గ‌తంలో జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో చురుగ్గా పాల్గొన్నా లాభం అంతంమాత్ర‌మే. తెలుగు దేశంలోకి యువతను ఎక్కువగా చేర్చాలన్న లక్ష్యంతో సైకిల్ యాత్ర కూడా చేపట్టారు.. కేబినెట్ విస్తరణ సందర్భంగా టిడిపి నేతలు చినబాబును కలిసేందుకు క్యూ కడుతున్నారంటేనే పార్టీలో లోకేష్ పవర్ ఏంటో తెలుస్తుంది.

ఇక కేటిఆర్ అమెరికాలో ఐటి ప్రొఫెషనల్ గా నిలదొక్కుకున్నారు.. వ్యాపారంలోనూ స్థిరపడ్డారు.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చూశాక.. హైదరాబాద్  ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.. కొత్త రాష్ట్రం కోసం పోరాడిన అనుభవం ఆయనకుంది.. రాష్ట్రానికి ఏం కావాలో.. ఆయనకు తెలుసు.. ఎన్నికల రాజకీయాలూ వంటబట్టాయి. ఐటి, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను తీసుకున్నారు.. ఐటి రంగంపై ఉన్న పట్టు.. హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చి దిద్దాలన్న తపన కేటిఆర్ ను ఈ శాఖలు ఎంపిక చేసుకునేలా చేశాయి. పాలనలో కూడా కేటిఆర్ తనదైన పట్టు సాధించారు.. తెలంగాణలో కేటిఆర్ ఇప్పటికే ఈ  శాఖలను దిగ్విజయంగా నిర్వహించారు.

అయితే ప్ర‌స్తుతం  కేటీఆర్‌కు కేటాయించిన శాఖ‌ల‌లో పంచాయితీ రాజ్‌శాఖ‌లు ముఖ్య‌మైన‌వి. ఐటీ శాఖ‌కంటే పంచాయితీ రాజ్ శాఖ‌ను నిర్వ‌హించాలంటే క‌త్తిమీద సామెన‌ని చెప్పాలి. మొద‌ట ఈశాఖ‌ల‌మీద ప‌ట్టుసాధించినా త‌ర్వాత  ప‌ని ఒత్తిడి భారం పెగ‌డంతో మూడు శాఖ‌ల‌నుంచి పంచాయితీ రాజ్ తొల‌గించి శాఖ‌ను జూప‌ల్లి కృష్ణారావుకు కేటాయించారు. అయితే లోకేష్‌కు  లోకేష్‌కూడా ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ‌ల‌నే నిర్వ‌హిస్తున్నారు. ఈ శాఖ‌ల‌మీద ఎలాంటి అనుభ‌వంలేదు. ఇప్పుడిప్పుడే ఈశాఖ‌ల‌మీద పాఠాలు నేర్చుకుంటున్నాడు. అనుభ‌వం ఉన్న కేటీఆర్ పంచాయితీ రాజ్ శాఖ‌ను వదులు కున్నాడు…. ఎలాంటి అనుభ‌వంలేని లోకేష్ మ‌రి ఆయ‌న‌కు కేటాయించిన శాఖ‌ల‌మీద ఎంత‌వ‌ర‌కు ప‌ట్టుసాధిస్తాడ‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఇద్దరూ సత్తా కలిగిన నేతలే.. ఇద్దరూ తండ్రి చాటు తనయులుగా అడుగు పెట్టిన వారే.. దశాబ్దం పాటూ తెలుగు ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన, నిలుస్తున్న పార్టీలను అజేయంగా నిలబెట్టడం వారి శక్తిసామర్ధ్యాలపై ఆధారపడిఉంది.. అభివృద్ధిలో పోటీ పడుతూ.. వినూత్న ఆవిష్కరణలకు తెర తీస్తూ.. పాలనను పరుగులు పెట్టిస్తారా అన్న‌ది ? లెటజ్ వాచ్..

Also Read

  1. ఏపీ, తెలంగాణాలో నియేజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న సురూ
  2. కొత్త‌ ఇళ్లు అదిరంద‌య్య చంద్రం…
  3. చంద్రబాబుకు షాక్.. వైసీపీలోకి తెలుగు తమ్ముళ్ళు
  4. బరి తెగించిన బాబు.. ఓడిపోయిన వారే ఎమ్మేల్యేలంటా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -