Wednesday, May 15, 2024
- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక ఏక‌గ్రీవంపై టీడీపీ మంత‌నాలు..

- Advertisement -
Chandrababu Negotiations..YS Jagan No.. for Nandyal by poll

నంద్యాల ఉప ఎన్నిక వ్య‌వ‌హారం ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరుగుతోంది.అధికార టీడీపీ గెలుపుపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతో ఏక‌గ్రీవానికి తెర‌లేపింది.ఏకంగా చంద్ర‌బాబు నాయుడే రంగంలోకి దిగారు.ఇది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

ఇందులో భాగంగా టిడిపి నంద్యాల అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డిని వైసిపి అధినేత జగన్ వద్దకు పంపించనున్నారని తెలుస్తోంది గ‌త సంప్ర‌దాయ ప్ర‌కారం ఎవరైనా చనిపోతే, వారి స్థానంలో కుటుంబ సభ్యులు నిలబడితే పోటీ పెట్టకూడదనే సంప్రదాయం ఉందని, దాని ప్రకారం ముందుకు వెళ్దామని బ్ర‌హ్మానంద‌రెడ్డి ద్వారా చంద్రబాబు వర్తమానం పంపించనున్నారని తెలుస్తోంది.

{loadmodule mod_custom,GA1}

ఇప్పటికే అఖిలప్రియ, భూమా కుటుంబ సభ్యులు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది. కానీ చంద్రబాబు రంగంలోకి దిగినా జగన్ పోటీ విషయంలో తగ్గే అవకాశాలు లేవని అంటున్నారు. శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్ ఇస్తానని చెప్పి పార్టీలోకి తీసుకున్నారు. కాబట్టి చంద్రబాబు విజ్ఞప్తికి జగన్ సానుకూలంగా స్పందించే అవకాశాల్లేవని అంటున్నారు.
నంద్యాల ఉప ఎన్నిక ఏకగ్రీవం కాకపోయినా, వైసిపి పోటీకి నిలిచినా టిడిపి ఘనవిజయం సాధించడం ఖాయమని టిడిపి నేతలు చెబుతున్నారు.నంద్యాల ఉప ఎన్నిక మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నుంది.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}ACHKQwOU6tg{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -