Friday, May 3, 2024
- Advertisement -

గ‌తంలో చేసిన త‌ప్పిదాలు చేస్తే మ‌రోసారి అధికారం దూర‌మ‌య్యే అవ‌కాశం..

- Advertisement -
YSRCP President YS Jagan should move to Amaravati soon

ఏపీలో ఎన్నిక‌లకు చాలా టైమున్నా….పార్టీలు మాత్రం గెలుపుకోసం సాయిశ‌క్తులా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాయి. ఒక‌రిపై ఒక‌రు కారాలు ….మిరియాలు నూరుకుంటున్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లు వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు డెడ్‌లైన్ లాంటివి.

గెలిస్తే ఆయ‌న‌కు తిరుగుండ‌దు… కాని జ‌గ‌న్ చేస్తున్న‌ కొన్న త‌ప్పిదాల వ‌ల్ల అయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

{loadmodule mod_custom,GA1}

ప్ర‌స్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ వైఫ‌ల్యాల‌పై పోరాడుతున్న వైసీపీకి మంచి మైలేజి వ‌స్తోంది. అన్ని స‌ర్వేలల్లోకూడా జ‌గ‌న్ సీఎం కావ‌డం ఖాయ‌మ‌నే ఫ‌లితాలు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా జ‌గ‌న్ ప్ర‌త్యేక‌హోదా, రైల్వేజోన్ పై కేంద్రం వైఖ‌రి ఎలా ఉన్నా టీడీపీపై మాత్రం వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఈపోరాటం స‌రిపోద‌ని ఇంకా దూకుడుగా ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాటంచేయాల‌ని విశ్లేష‌కులు సూచించారు.
జ‌గ‌న్‌ను ప్ర‌ధానంగా క‌ల‌వ‌ర‌పెడుతున్న అంశాల్లో.. గ్రామ‌స్థాయిలో క్యాడ‌ర్ ఉన్నా, వారిని ముందుకు న‌డిపించే స‌రైన నాయుకులు లేరన్న‌ది వాస్త‌వం. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే సంద‌ర్భాల్లో శృతిమించ‌డం, సీనియ‌ర్ నేత‌ల మాట‌ల‌ను లెక్క‌చేకుండా ఉండ‌టం… నియేజ‌క వ‌ర్గాల్లో స‌రైన నాయ‌కుల‌ను నియ‌మించ‌క‌పోవ‌డంలాంటివి జ‌గ‌న్‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.

{loadmodule mod_custom,GA2}

గ‌త ఎన్నిక‌ల్లో త‌క్కువ ఓట్ల‌తో అధికారాన్ని కోల్పోయామ‌ని జ‌గ‌న్ ప‌దేప‌దే చెప్తుంటారు. కాని ఇప్ప‌టికి హైద‌రాబాద్‌నుంచే రాజ‌కీయాలు న‌డుపుతుండ‌టం పార్టీకి డ్యామేజ్ క‌లుగుతోంది. ప‌రిపాల‌నా అంతా ఏపీ నుంచి జ‌రుగుతున్న స‌మ‌యంలో జ‌గ‌న్ అక్క‌డ‌నుంచే పాల‌న కొన‌సాగిస్తే ఆయ‌నుకు తిరుగుండ‌దు. పార్టీ నాయ‌కులుకూడా హైద‌రాబాద్‌కు రావాలంటె ఇబ్బందులు ప‌డుతున్నార‌ని.. వెంట‌నే త‌న మ‌కాం రాజ‌ధాని అమ‌రావ‌తికి మార్చాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}fW3OIF-VwFc{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -