Tuesday, May 14, 2024
- Advertisement -

మైలేజీకి పోటీప‌డుతున్న ఇద్ద‌రు చంద్రుల్లు….

- Advertisement -
KCR and Chandrababu Trying to Get political mylage in Presidential Elections

ఈమ‌ధ్య‌న తెలుగు రాష్ట్రాల సీఎంలు పిట్ట‌క‌థ‌లు చెప్ప‌డం బాగా అల‌వాటు అయ్యింది. దేశంలో ముఖ్య‌మంత్రులు లేన‌ట్లు …ఎవరూ చెప్పుకోలేని రీతిలో గొప్పలు చెప్పుకోవటం.. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పాత్ర చాలా కీలకమన్నట్లుగా బడాయికి పోవటం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మైలేజికోసం పోటీప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం కేంద్రంలో నరేంద్రమోడీతో పెట్టుకోవాలంటే దేశంలో పెద్ద పెద్ద నాయకులే కాదు, బిజెపిలో ఉన్న పెద్దలు కూడా భయపడుతున్న పరిస్థితి. మోడీ, అమిత్ షాలు తీసుకునే నిర్ణయాలకు అడ్డుచెప్పే స‌హ‌సం ఎవ‌రూ చేయ‌రు. మరి ఆ స్థాయి నాయకుడికి కెసీఆర్ సలహా ఏం అవసరమొచ్చింది? అయినా ఒకరి సలహాతో రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన పరిస్థితుల్లో మోడీ ఉన్నాడా?

{loadmodule mod_custom,GA1}

రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ ను ఎంపిక చేసిన తర్వాత ప్రధాని మోడీ పలువురు సీఎంలతో మాట్లాడారు.ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రపతి అభ్యర్థిపైన తమదైన శైలిలో గొప్పలు చెప్పుకోవటం విశేషం.మోడీ బ్యాచ్ ఎంపిక చేసిన దళిత నేత రామ్ నాథ్ కు తమ మద్దతు ఉంటుందని కేసీఆర్ చెప్పేశారు. ఇది జరిగిన కాసేపటికే తెలంగాణరాష్ట్ర సీఎంవో ఒక ప్రకటనను విడుదల చేసింది.
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ చేసిన సూచనను ప్రధాని మోడీ పరిగణలోకి తీసుకున్నారని.. ఆ విషయాన్ని మోడీనే స్వయంగా కేసీఆర్ తో ప్రస్తావించారంటూ ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. “మీ సూచన మేరకు ఒక దళిత నాయకుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశాం” అని కేసీఆర్ కు ప్రధాని మోడీ చెప్పినట్లుగా పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫు నుంచి ఇలాంటి ప్రెస్ నోట్ వస్తే.. ఏపీ సీఎంవో మాత్రం ఊరుకుంటుందా? తమ అధినేత గొప్పతనాన్ని.. కీర్తిని చాటేలా ప్రెస్ నోట్ ను సిద్ధం చేసేశారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వం ఖరారు చేసిన వెంటనే ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రధాని మోడీ మాట్లాడారని.. రామ్ నాథ్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరటం.. ఆ వెంటనే ఓకే అనటమే కాదు.. సరైన అభ్యర్థిని ఎంపిక చేశారంటూ మోడీని ముఖ్యమంత్రి కీర్తించినట్లుగా చెప్పేశారు.

{loadmodule mod_custom,GA2}

ఎన్నికల మోడీ పరివారం కంటే కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక భూమిక పోషించినట్లుగా చెప్పుకోవటం విశేషంగా కనిపించక మానదు. ఏమైనా ఇద్దరు చంద్రుళ్లు.. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తమ మైలేజీని పెంచుకోవటానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెప్పక తప్పదు.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}H70hXihAEhU{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -