Thursday, April 25, 2024
- Advertisement -

‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్‌’ మూవీ రివ్యూ

- Advertisement -
Duvvada Jagannadham Review

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా సరైనోడు తర్వాత స్టార్ డైరెక్టర్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే అనే సినిమా చేసాడు. దీల్ రాజ్ నిర్మించిన ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ రోజే రిలీజ్ అయిన ఈ డీజే మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ అలియాస్ శాస్త్రి ( అల్లు అర్జున్‌).. త‌న ఫ్యామిలీతో క‌లిసి అన్న‌పూర్ణ క్యాట‌రింగ్ నడుపుతుంటాడు. త‌న ఫ్రెండ్ వెన్నెల కిషోర్ ద్వారా పూజా హెగ్డేతో పరిచయం ఏర్పడుతుంది. ఆ క్రమంలో అల్లు అర్జున్‌ హెగ్డేతో ప్రేమలో పడుతాడు. అయితే పూజా మాత్రం ప్రేమ లేదు ఏం లేదని వెళ్లిపోతుంది. పూజ తండ్రి హోం మినిస్ట‌ర్ పోసాని కృష్ణ‌ముర‌ళి త‌న కూతురికి రొయ్య‌ల నాయుడు (రావూ ర‌మేష్‌) కొడుకు సుబ్బ‌రాజుతో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. అయితే సుబ్బ‌రాజుతో పెళ్లి ఇష్టం లేని పూజ తిరిగి జ‌గ‌న్నాథ‌మ్ శాస్త్రినే పెళ్లి చేసుకుంటాన‌ని అంటుంది. ఈ క్రమంలో 9 వేల కోట్లు డిపాజిట్లు సేక‌రించి.. అగ్రి డైమండ్ కంపెనీ బోర్డు తిప్పేస్తారు. దీని వెనక రొయ్య‌ల నాయుడు ఉంటాడు. రొయ్య‌ల నాయుడు వెనక హోం మినిస్ట‌ర్ ఉంటాడు. ఈ అన్యాయాల‌ తెర‌వెన‌క నుండి డీజే ఫైట్ చేస్తాడు. ఈ నెపథ్యంలో అగ్రి డైమండ్ ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేసిన రూ. 9 వేల కోట్ల‌ను వాళ్లకు ఇచ్చేందుకు డీజే ఓ ఆఫ‌రేష‌న్ నిర్వ‌హిస్తుంటాడు. ఈ క్ర‌మంలో అత‌డికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయి ? రొయ్య‌ల నాయుడు భ‌ర‌తం ఎలా ప‌ట్టాడు ? డీజే దుబాయ్ ఎందుకు వెళ్లాడు ? మ‌రి డీజేకు క్యాట‌రింగ్ చేసుకునే శాస్త్రికి లింక్ ఏంటి ? వీరిద్ద‌రు వేర్వేరా ? లేక ఒక‌రేనా ? మ‌రి పూజాతో శాస్త్రి పెళ్లి జ‌రిగిందా ? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ డీజే.

{loadmodule mod_custom,GA1} 

ప్లస్ పాయింట్స్ :

అల్లు అర్జున్ శాస్త్రి క్యారెక్టర్ లో సరిగ్గా సరిపోయాడు. పాత్ర పోష‌ణ‌, వాచ‌కం చెప్ప‌డం లాంటివి బన్నీ అద్భుతంగా చేసాడు. అలానే మోడ్ర‌న్ బాయ్‌గా కూడా అదరగొట్టాడు. ఒక పాత్రకు మరొక పాత్ర సంబంధం లేకుండా అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది. ఇక హీరోయిన్ పూజా హెగ్డే న‌ట‌న‌తో కంటే అందాల ఆర‌బోత‌తో క‌ట్టి ప‌డేసింది. ఆమె సోయ‌గాలు, ప్ర‌తి సీన్‌లోను తొడ‌ల‌కు కాస్త పై వ‌ర‌కు కనిపించే డ్రెస్సులు, ఇవి చాల‌వ‌న్న‌ట్టు స్విమ్మింగ్ పూల్‌లో ఆమె బికినీ ఇవి చాలు ఆమె యూత్‌కు ఎలా పిచ్చెక్కించేస్తుందో చెప్ప‌డానికి. ఇక విల‌న్‌గా రొయ్య‌ల నాయుడు క్యారెక్ట‌ర్‌లో నిక్క‌ర్ వేసుకుని రావూ ర‌మేష్‌ చాలా బాగా నటించాడు. హోం మంత్రిగా పోసాని కూడా రావూ ర‌మేష్‌ కి స‌పోర్టింగ్ పాత్ర చేసాడు. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు చాలా ప్ల‌స్ అయ్యింది. ఇక పోలీస్ రైట‌ర్ క్యారెక్ట‌ర్‌లో ముర‌ళీశ‌ర్మ‌, బ‌న్నీ తండ్రి క్యారెక్ట‌ర్‌లో త‌నికెళ్ల భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, అగ్ర‌హారంలో ఉండే గ్యాంగ్ త‌మ పాత్ర‌ల వ‌ర‌కు బానే చేశారు. సినిమా క‌ల‌ర్ ఫుల్‌గా చూపించాడు అయాంక బోస్‌. ఇక దేవిశ్రీ పాట‌లు ఇప్ప‌టికే పాపుల‌ర్ అయ్యాయి. తెర‌మీద కూడా వాటికి బ‌న్నీ, పూజ మంచి పెర్పామ్ ఇచ్చారు. బ‌న్నీ త‌న‌కు అల‌వాటైన స్టైల్లోనే డ్యాన్సుల్లో దంచేశాడు. యాక్ష‌న్ సీన్లు రామ్‌-ల‌క్ష్మ‌ణ్ డిఫ‌రెంట్‌గా చేయించారు. ఇక దిల్ రాజుకు నిర్మాత‌గా 25వ సినిమా కావ‌డంతో ఆయ‌న రాజీ ప‌డ‌కుండా ఖ‌ర్చు పెట్టారు. ఆయ‌న పెట్టిన ప్ర‌తి రూపాయి తెర‌మీద బాగా ప్ర‌జెంట్ అయ్యింది. ఇక దర్శకుడు హరిష్ శంకర్ స్టోరీ పై కన్న స్క్రీన్ ప్లే పై ఎక్కువ దృష్టి పెడతాడు. ఆయన గత సినిమాలు చూసుకున్నా అదే తెలుస్తోంది. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్ష‌కుడిని కాస్త మాయలో ప‌డేసి తాను గ‌ట్టెక్కే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఇప్పుడు ఈ సినిమాలోను అదే చేశాడు. కథ రొటిన్ గా ఉన్న కథనం బాగుంది. కొత్తగా రాసుకున్న సీన్లు బాగున్నాయి. ముఖ్యంగా హ‌రీశ్ శంక‌ర్ రాసిన పంచ్ డైలాగ్స్‌ చాలా బాగున్నాయి.

{loadmodule mod_custom,GA2} 

మైనస్ పాయింట్స్ :

ముఖ్యంగా ఈ సినిమాలో మైనస్ పాయింట్ విషయంకు వస్తే.. కథలో దమ్ము లేదు. ఫ‌స్టాఫ్‌లో కథ ను బానే నడిపించిన.. సెకండాఫ్‌లో క‌థ‌నం రొటీన్ అయిపోయింది. సినిమాలో ట్విస్టులు ఉండ‌వు. బ‌న్నీ, డీజేకు లింక్ ఏంట‌న్న‌ది కూడా ఎవ్వ‌రికి ఆస‌క్తి క‌లిగించ‌లేదు. ఇక నిజాల కోసం శాస్త్రి ఫ్యామిలీని టార్గెట్ చేసేట‌ప్పుడు వ‌చ్చే ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు తేలిపోయాయి. హ‌రీశ్ శంక‌ర్ సినిమాలు చూస్తే పెద్ద‌గా రిస్క్ చేసేందుకు ఇష్ట‌ప‌డ‌డు అని ఈ సినిమాతో మరోసారి రుజువు అయింది. క‌థ‌, డైరెక్ష‌న్ అన్ని పాతగానే ఉంటాయి. చాలా సీన్లు అయితే  చాలా సినిమాల్లో చూసిన‌వే క‌ళ్ల ముందు క‌దులుతుంటాయి. కథ కొత్తది కాకపోయిన సీన్స్ కొత్తగా రాసుకున్నారు.

మొత్తంగా :

అల్లు అర్జున్ ను రెండు డిఫరెంట్ పాత్రల్లో చూసే అభిమానులు డీజే సినిమాని ఇష్టపడుతారు. అలానే.. బన్నీ కొత్తరకం యాక్టింగ్.. పూజా అందాలు.. కామెడీ, మాస్, క్లాస్, డాన్స్, రొమాన్స్.. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా కనిపించగా.. కథలో దమ్ము లేకపోవడం.. సెకండ్ ఆఫ్ అంతగా లేకపోవడం.. కొన్ని సీన్లు బోరు కొట్టడం.. మైనస్ పాయింట్స్ గా కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. అల్లు అర్జున్ అభిమానులకు ఈ సినిమా తెగ నచ్చిన.. స‌గ‌టు సినీ అభిమానికి మాత్రం ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు.

{youtube}o35vg3zIfVQ{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -