Sunday, May 19, 2024
- Advertisement -

చంద్రబాబు వల్లనే గోదావరి పుష్కరాల్లో చావులు

- Advertisement -

ఒక్కొక్క సంఘటన మనుషుల మనస్సులో తీవ్రంగా నాటుకుని పోతుంది ఆ సంఘటనలో జరిగిన నష్టాన్ని బట్టి అది అందరి హృదయాలలో ఎప్పుడూ భయంగా ఉండిపోతుంది. అలాంటి సంఘటనే గోదావరి పుష్కరాల టైం లో జరిగింది. సిబ్బంది అజాగ్రత్త వల్ల , అత్యుత్సాహం వల్ల దాదాపు పాతికమంది నిండి ప్రాణాలు గాల్లో కలిసిపోయిన సంఘటన ఇది. ఇది ఇంకా మర్చిపోకముందరే మళ్ళీ కృష్ణా పుష్కరాలు ఒచ్చాయి.

ఇలాంటి సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు , సిబ్బందీ. పుష్కర ఏర్పాట్ల విషయం లో ముఖ్యమంత్రి తో సమావేశం అయిన అధికారులలో ఒకాయన ‘‘సార్.. నేను గోదావరి పుష్కరాల్లోనూ పనిచేశాను. సీఎం వస్తారని చెప్పి భక్తులను నిలిపివేశారు. మీరు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా భక్తులను వదిలేసరికి తొక్కిసలాట జరిగిందని నాతో చాలా మంది చెప్పారు.

కాబట్టి ఇప్పుడు కృష్ణ పుష్కరాల్లో మీరు స్నానానికి ఎప్పుడు వస్తారో ముందే చెబితే బాగుంటుంది. మేము భక్తులు అప్రమత్తంగా ఉంటాం ” అని అనేశారు. దీంతో సమావేశంలో కొద్ది నిమిషాల పాటు మౌనం రాజ్యమేలింది.  గోదావరి పుష్కర తొక్కిసలాటకు మీరే కారణం అన్నట్టుగా సీఎంతోనే నేరుగా అనేశారా అధికారి… అంతేకాదు.. ఈసారి కూడా మీరు చెప్పాపెట్టకుండా వస్తే మరోసారి ఇబ్బందులు వచ్చేఅవకాశం ఉందన్నట్టుగా అధికారి మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -