Monday, May 20, 2024
- Advertisement -

బాబు ప‌రిస్థితి దారుణం.. సొంత పార్టీ నేతలే తిడుతున్నారు

- Advertisement -
chandrababu wrong steps

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రిస్థితి దారునంగ త‌యారయ్యంది. ఉద‌యం నుంచి రాత్రి నిద్ర‌పోయేవ‌ర‌కు  జ‌గ‌న్ మీద విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు.  ఎక్కడికి వెల్లినా జ‌గ‌న్ ఫోబియానే. జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసేదానికి కేటాయించే టైంలో కొంత స‌మ‌యాన్నైనా ప‌రిపాల‌న‌మీద దృష్టి సారిస్తే కొంత వ‌ర‌కైనా ప్ర‌జ‌ల క‌ష్టాలు తీరుతాయి. జ‌గ‌న్‌ను దెబ్బ‌కొట్టాల‌ని పార్టీ  పిరాయింపుల‌కు తెర‌దీశాడు బాబు గారు. ఏకంగా మంత్రిప‌ద‌వులు ఆశ చూపించి …లొంగ‌ని వారిని న‌యానో భ‌యానో కేసులు మోపుతాన‌ని బెదిరించి వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను టీడీపీలోకి వ‌చ్చేవిధంగా వేసిన ప్లాన్ ను బాగానే అమ‌లు చేశారు. అపిరాయింపులే ఇప్పుడు బాబును కొంప ముంచాయి.

తెలంగాణా టీడీపీనుంచి టీఆర్ ఎస్ లోకి వెల్లిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌కు కేసీఆర్ మంత్రి ప‌ద‌విని ఇవ్వ‌డంపై బాబు ఏరేంజ్‌లో పైర్ అయ్యారో అంద‌రికే తెలిసందే. టీడీపీ  త‌రుపున గెలిచి వారు రాజీనామాచేయ‌కుండా పార్టీలో్కి చేర్చుకొని మంత్రి ప‌ద‌వి ఎలా ఇస్తార‌ని నీతులు మాట్లాడిన బాబు ….అదే ఏపీలో మాత్రం పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌వ్చు.  అదే మంటే ఇత‌రుల‌లు చేస్తే త‌ప్పు నేను చేస్తే ఒప్పు అని సిగ్గులేకుండా స‌మ‌ర్ధించుకున్నారు. ఎప్పుడూ నీతి,నిజాయితీల గురించి మాట్లాడే బాబు గుర‌వింద త‌న న‌లుపు ఎరుగ‌న‌ట్లు నీతి వ్యాఖ్యలు చెప్ప‌డం బాబుకు ప‌రిపాటే.

ఇప్ప‌టికే ఏపీలో అధికార పార్టీపై రోజురోజుకూ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగిపోతోంది. ఇక ప్ర‌జ‌ల‌కు ,రైతుల‌కు.నిరుద్యోగుల‌కు ఇచ్చిన హామీల చిట్టా చెప్పుకుంటూ పోతే ఒక్క‌టేమిటీ  వంద‌లు ఉంటాయి.ఇక చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుతో  పార్టీసీనియ‌ర్ నేత‌లు ప‌రిస్థితి దారునంగా త‌యార‌య్యంది.  ఒక్కో   ఎమ్‌ఎల్ఏకు రూ.20 నుంచి 30 కోట్లు ఇచ్చి కొనుక్కున్న బాబుకు వొరిగిందేమిటి. మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్తీక‌ర‌ణ‌లో పార్టీ పిరాయించిన నాయ‌కుల‌కు పెద్ద‌పీట వేయ‌డంతో ఒక్క సారిగా పార్టీలో నిర‌స‌న‌లు ,అసంతృప్తులు బ‌గ్గుమ‌న్నాయి. మంత్రి ప‌ద‌వుల‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న సీనియ‌ర్ నాయ‌కులైన గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రి, బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి, ధూళి పాల్ల న‌రేంద్ర‌,బోండా ఉమామ‌హేశ్వ‌ర్‌రావుతోపాటు  మంత్రిప‌ద‌వులు రాని ఇత‌ర నేత‌లు బ‌హిరంగంగానే బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏకంగా రాజీనామాలు చేసేందుకు వెనుకాడ‌లేదు.

ఇక పార్టీకీ వెన్నుద‌న్నుగా ఉన్న  సీనియ‌ర్ నాయ‌కులలో చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ రెడ్డి కూడా బాబుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు ఎక్క‌పెట్టారు. ద‌ళిల‌కు బాబు తీవ్ర అన్యాయం  అన్యాయం చేశార‌ని బ‌హిరంగంగానే విమ‌ర్శించారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ అధినేత తీసుకున్న‌నిర్ణ‌యాలమీద ఎవ‌రూ అభ్యంత‌రం చెప్పేవారుకాదు.కానీ ఇప్పుడు పార్టీలో బాబు మాట వినేవారులేరు. శ‌త్రువుకు ఒక క‌న్ను పోవాల‌ని త‌లిస్తే రెండు క‌ళ్లు పోయాయి.బాబు ప‌రిస్థితికూడా ఇప్పుడు ఇలాగే ఉంది. ఉన్న‌ది పాయే …. ఉంచుకున్న‌దీ పాయే  అన్న విధంగా త‌యార‌య్యంది బాబు ప‌రిస్థితి.

Related

  1. ఒంట‌రి పోర‌న్న‌ ప‌వ‌ణ్ మాట‌లు ఉత్తిత్తేనా టీడీపీ స్కెచ్‌లో భాగ‌మేనా
  2. లోక‌ల్ … నాన్‌లోక‌ల్ కేటీఆర్ పంచ్ అదిరింది
  3. ప్ర‌తీ స‌వ‌త్స‌రం మ‌త్రులు వారి ఆస్తులు వెల్ల‌డించాల్సిందే.  
  4. కొత్త పార్టీ పై సంచలన కామెంట్స్ చేసిన ఎన్టీఆర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -