ఆ విషయంలో.. మాట తప్పిన మోడీ !

- Advertisement -

2014 ఎన్నికల ముందు భారత జనతా పార్టీ అధికరంలోకి వచ్చేందుకు అనేక హామీలను ప్రకటించింది. ఇక ఆ తరువాత నరేంద్ర మోడి మానియాతో అధికారం చేపట్టిన బీజేపీ అప్పటినుంచి ఇప్పటివరకు కూడా అధికారంలో కొనసాగుతోంది. అయితే నరేంద్ర మోడి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ” నల్లధనాన్ని తిరిగి తీసుకొచ్చే విధానం ” ఒకటి. ఈ హామీని ఎన్నికల ప్రచారంలో నొక్కి చెప్పారు నరేంద్ర మోడి. స్విస్ బ్యాంక్ లో దాచిన నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని, ఆ నగదును దేశ ప్రజలకు పంచుతామని గట్టిగానే చెబుతూ వచ్చారు.

ఆ తరువాత ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 2016 లో 500 నోట్లు, 1000 నోట్లు రద్దు చేశారు. అందువల్ల నల్లధనం భారీగా బయటపడే అవకాశం ఉందని డీమోనిటైజేషన్ చేసినప్పటికీ పెద్దగా ఫలితం ఏమి కనిపిచలేదు. ఇక ఆ తరువాత నల్లధనానికి సంబంధించిన ప్రస్తావనను నరేంద్ర మోడీ పూర్తిగా అట్టకెక్కించారు. దాంతో ప్రతి ఏడాది కూడా స్విస్ బ్యాంక్ లో భారతీయులు దాచుకున్న నల్లధనం రెట్టింపు అవుతూ వస్తోంది. స్విస్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020 భారతీయులు దాచుకున్న నల్లధనం 20,700 కోట్లు ఉంటే 2021 నాటికి 30,533 కోట్లకు చేరింది. ఇంత భారీ స్థాయిలో స్విస్ బ్యాంక్ లో దాచుకున్న భారతీయుల నల్లధనం పెరిగిపోతుంటే మోడీ సర్కార్ మాత్రం చూసి చూడనట్లుగా వదిలేస్తోంది.

- Advertisement -

ఇదే విషయాన్ని ఇటీవల పార్లమెంట్ లో విపక్షాలు ప్రస్తావించినప్పుడు.. కేంద్ర ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వకపోవడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారతీయులు స్విస్ బ్యాంక్ లో దాచుకున్న నల్లధనకి సంభంధించిన వివరాలు తమ వద్ద లేవని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలసీతారామన్ లోక్ సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఒక వైపు భారతీయుల నల్లధనం స్విస్ బ్యాంక్ లో పెరిగిపోతోందంటూ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. మరో వైపు అందుకు సంబంధించిన వివరాలు తమ వద్ద లేవని కేంద్రం చెప్పడంతో నల్లధనానికి వెనక్కి తీసుకురావడంలో మోడి సర్కార్ మాట తప్పుతోందనే వార్తలు వస్తున్నాయి.

Also Read

మోడి పాలన.. బ్రిటిషర్ల పాలన !

దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా ?

“గడప గడపకు ” జగన్ కు సమస్యేనా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -