Monday, May 20, 2024
- Advertisement -

చంద్రబాబు కి చేతకానిది జగన్ చేస్తున్నాడు

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యెక హోదా సెంటిమెంట్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచీ అందరూ ఈ విషయం మీదనే మల్ల గుల్లాలు పడుతున్నారు. చంద్రబాబు సీరియస్ గా హోదా కోసం పోరాటం చెయ్యడం లేదు అనీ తన అవకాశాలు, అవసరాలూ, పరిస్థితులూ చూసుకుని మరీ జాగ్రత్తగా కేంద్రం తో మసలుతున్నారు అని చెబుతున్నాయి పొలిటికల్ వర్గాలు.

డిల్లీ పర్యటన లో గానీ కేంద్రం తో చర్చించాల్సి ఒచ్చినప్పుడు గానీ ఆయన ఒక్కరే అన్నీ అయ్యి వ్యవహారాలు చక్క బెడుతున్నారు. మిగితా పార్టీలని, నాయకుల్నీ ఎక్కడా కలుపుకునే ఉద్దేశ్యం లో కూడా బాబు ఉన్నట్టు కనపడ్డం లేదు. మిగతా పార్టీలకు నామమాత్రంగా అయినా భాగస్వామ్యం కల్పించకపోవడంతో హోదా కోసం రాజ్యాంగబద్దమైన ప్రయత్నం అంతా సోలో షోగా మారిపోతోందనే విమర్శ విపక్షాల నుంచి ఉంది. ఇదే పరిస్థితిని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చక్కగా ఉపయోగించుకుంటున్నారనే టాక్ నడుస్తోంది.

చంద్రబాబు కి పూర్తి భిన్నంగా జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం అందరు పార్టీల వారినీ కలుపుకుంటూనే ప్రయాణం చేస్తున్నారు. డిల్లీ వెళ్ళిన జగన్ అక్కడ ప్రణబ్ ని కలిసి ఊరుకోకుండా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ని స్వయంగా కలిసారు.  సీపీఐ జాతీయ నేత డీ రాజాతో చర్చించారు. తద్వారా దేశంలో బీజేపీ కాంగ్రెస్ తర్వాత కీలకమైన రెండు పార్టీలైన సీపీఐ సీపీఎంలతో జగన్ ముందుకు సాగుతున్నారు. సీతారాం ఏచూరి డీ రాజా కూడా ఇదే విషయం చెప్పడం ఆసక్తికరం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -