Monday, May 6, 2024
- Advertisement -

లోకేష్‌కు ప్ర‌మోహ‌ష‌న్‌.. సీనియ‌ర్ల‌కు డిమోష‌నా…

- Advertisement -
Nara Lokesh gets promotion and senior leaders demotion

రాజ‌కీయంగా ఏమాత్రం అనుభ‌వంలేని లోకేష్‌కు మంత్రిప‌ద‌విఇచ్చి ప‌రువుతీసుకున్న చంద్ర‌బాబు మ‌ల్లీ ఇప్పుడు అదే త‌ప్పుచేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌తిప‌క్షం,సోషియ‌ల్ మీడియానుంచి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా కొడుకును ప్ర‌మోట్ చేయ‌డంలో మాత్రం వెన‌కాడ‌డంలేదు.

నేరుగా ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చిన వెంట‌నే ..మంత్రిని చేశారు. కాని ఇప్పుడు కొడుకుకి మ‌రో ప్ర‌మేష్‌న్ ఇచ్చారు. రాజ‌ధాని బూముల క‌మిటీలో స్థానం క‌ల్పించారు.
ఇక ఏపీలో ఎవ‌ర‌కి భూములు కేటాయించాల‌న్నా లోకేష్ అనుమ‌తి త‌ప్ప‌నిస‌రికానుంది.ఆంధ్రప్రదేశ్‌ భూకేటాయింపులపై ఇది వరకే ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలోకి నారా లోకేష్‌ను కూడా చేర్చారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఆనందబాబుతో పాటు నారా లోకేష్‌ కూడా ఉండనున్నారు.ఇప్పటి వరకు భూ కేటాయింపుల మంత్రివర్గ ఉప సంఘంలో యనమల, నారాయణ హవా సాగేది. ఇప్పుడు నారా లోకేష్ ఎంట్రీతో యనమల, నారాయణ డమ్మీలు కానున్నారు. రాష్ట్రంలో ఇకపై ఏ భూ కేటాయింపులు జరిగినా అందుకు నారా లోకేష్ ఆమోదం ఉండాల్సిందేనని చెబుతున్నారు. భూకేటాయింపులపై ఏర్పాటైన సబ్‌ కమిటీలో ప్రవేశ అర్హత లేకపోయినప్పటికీ లోకేష్ నేరుగా గతంలో పాల్గొన్నారు. దీంతో పెద్దెత్తున విమర్శలు వచ్చాయి.
రెండు నెలల క్రితమే రాజకీయాల్లోకి వచ్చిన నారాలోకేష్ ఇకపై భూ కేటాయింపుల సబ్‌కమిటీలో చక్రం తిప్పడాన్ని సీనియర్లు అయిన యనమల రామకృష్ణుడు, నారాయణ ఎంత వరకు జీర్ణించుకుంటారన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది.భూకేటాయింపుల ద్వారా వేల కోట్ల ముడుపులు చేతులుమారుతున్న విషయం జగమెరిగిన నేపథ్యంలో .. లోకేష్‌ కనుసన్నల్లోనే భూ కేటాయింపులు జరగాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
మ‌రో వైపు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో సీనియ‌ర్‌ల‌ను త‌ప్పించి ..ఏమాత్రం ప‌రిపాల‌నా అనుభ‌వంలేని లోకేష్‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చుకున్నారు. ఇప్పుడు భూముల ఉప‌సంఘంలో స్థానం క‌ల్పించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.ఇప్ప‌టికే ఎలామాట్లాడాలో తెలియ‌కు ప‌రువు పోగొట్టుకున్న లోకేష్‌కు ప్ర‌మేషన్ …. సీనియ‌ర్ మ‌త్రుల‌కు డిమోష‌నా అన్న అభిప్రాయాలు పార్టీలో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. లోకేష్ మ‌ళ్లీ ఎక్క‌డ నోరు జారుతార‌నే విదేశీప‌ర్య‌ట‌న‌ నుంచి త‌ప్పించారంట‌
  2. మంత్రుల ముందు లోకేష్ ఓ రెంజ్ లో సీరియస్ అయిన చంద్రబాబు
  3. లోకేష్‌పై జ‌గ‌న్ పంచ్
  4. బాబుని మరోసారి అడ్డంగా బుక్ చేసిన లోకేష్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -