అరే సాంబా …రాసుకో… ఐటీ మత్రి లోకేష్ నోటి నుంచి రాలిన మరో ఆణిముత్యం. ఇదేదో సినిమా కాదండోయ్. కొంత కాలంగా ఆయన నోటి నుంచి జాలువారుతున్న ఆణిముత్యాలు. సోషియల్ మీడియా లోకేష్‌ను ఉతికి ఆరేసినా ఆయనలో మార్పుశూన్యం.
బహిరంగ సభలకు వెల్లిన ప్రతీ సారి అనాలోచితంగా మాట్లాడి వ్యాఖ్యలు సామాజికి మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాటిపై కొన్ని రోజుల వరకు నెటిజన్లకు కాలక్షేపం అయ్యింది. అయితే తాజాగా ఆయన నోటి నుంచి మరో ఆణిముత్యం వచ్చింది.
గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో సైకిల్‌కు ఓటు వేస్తే తడిగుడ్డతో మన గొంతు మనమే కోసుకున్నట్లే నని సంచల వ్యాఖ్యలు చేశారు.మరోసారి పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఉన్న అవినీతి,కులపిచ్చి,మతపిచ్చి ఉన్న ఏకైక పార్టీ ఉందంటే అది టీడీపీ కాదాని సమావేశానికి హాజరయిన వారిని ప్రశ్నించి కంగుతిన్నారు. అప్పుడు ఎమ్మెల్సీ కాదు . మంత్రి కాదు అందుకని దాన్ని లైట్‌గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు మంత్రి హోదాలో ఉండి రాష్ట్రంలోని యువతకు ఆదర్శంగా ఉండాల్సిందిపోయి …. అనాలోచితంగా మాట్లాడి చులకన అవుతున్నారు.
{loadmodule mod_custom,Side Ad 1}
ఈ మధ్యనే భారత రాజ్యాంగ నిర్మాత అంబేత్కర్ జయంతికి బదులు…వర్ధంతి శుభాకాంక్షలని తన పరువు తానే తీసుకున్నారు.ఇప్పుడు మరోసారి మాట్లాడుతూ తడబడ్డాడు. ప్రత్యర్తి జట్టుతో మైదానంలో తలబడటానికి దిగిన క్రికెట్ జట్టులో 12 మంది ఆటగాల్లుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.జయంతిని వర్ధంతిని చేసినట్లు ….. 11 మంది సభ్యులగల టీంలో 12 మంది ఉంటారనడంలో ఆశ్చర్యంలేదంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిన్లు జోకులు వేస్తున్నారు. మరి ఇప్పటి కైనా లోకేష్ మారతాడా లేకుంటే ఇదే కంటిన్యూ చేస్తారా చూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}dFteeJ-xwvU{/youtube}
Also Read