Thursday, May 16, 2024
- Advertisement -

నంద్యాలపై అఖిల ప‌ట్టు సాధించ‌నుందా…? ఉపెన్నిక ఏక‌గ్రీవంపై విజ‌య‌మ్మ కీల‌క పాత్ర‌

- Advertisement -
New twist in Nandyal by election

నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో మ‌రో ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న తెర‌పైకి వ‌చ్చింది.మొన్నటివరకూ హాట్ హాట్‌గా సాగిన నంద్యాల పాలిటిక్స్ సడన్‌గా చల్లబడటానికి గల కారణం ఏంటి…? పోటీకి సై అన్న అధికార‌,విప‌క్ష‌పార్టీలు ఇప్పుడు ఏక‌గ్రీవం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు..?

త‌మ కుటుంబానికే ఏక‌గ్రీవంగా ఉపెన్నిక టికెట్ ద‌క్కేందుకు అఖిల‌ప్రియ ప్ర‌యేగించిన ఆస్త్రం ఏంటి..? ఏక గ్రీవంలో ఎవ‌రు కీ రోల్ పోషిస్తున్నారు…? నంద్యాల ఉప ఎన్నిక‌లో అస‌లు ఏంజ‌రుగుతోంది…?
గ‌త కొంత‌కాలంగా స‌ద్దుమ‌నిగిన నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు మ‌ళ్ల వేడెక్కింది.భూమానాగిరెడ్డి మ‌ర‌ణంలో అనేక మ‌లుపులు తిర‌గిన ఉప ఎన్నిక వ్య‌హ‌హారలో ఇప్పుడు మ‌రో అస‌క్తిక‌రం సంఘ‌ట‌న తెర‌పైకి వ‌చ్చింది.నిన్నిటి వ‌ర‌కు అభ్య‌ర్తి విష‌యంలో తారాస్తాయికి చేరిన రాజ‌కీయాలు ఇప్పుడు స‌డ‌న్‌గా చ‌ట్ట‌బ‌డ్డాయి.అస‌లు దీనికి కార‌నం ఏంట‌నేది ఇప్పుడు ప్ర‌జ‌లు,రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకిత్తిస్తోంది.
నంద్యాల శాసనసభ టికెట్ గత సంప్రదాయం ప్రకారం భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ ఇవ్వాల్సి ఉంటుంది.కానీ శిల్పా మోహ‌న్‌రెడ్డి టికెట్టు కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నం చేయ‌డంతో టీడీపీలోనే పోటీ నెల‌కొంది.అఖిల ప్రియ‌కుటుంబంనుంచి కాకుండా ఆపార్టీ త‌రుపునుంచి ఎవ‌రు పోటీ చేసినా …వైసీపీ నుంచి అభ్య‌ర్తిని నెలుపుతామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

{loadmodule mod_custom,GA1}

నంద్యాల టికెట్‌పై భూమా, శిల్పా కుటుంబాల మధ్య విభేదాలు పొడసూపడంతో చంద్రబాబు కల్పించుకున్నారు. ఇరు వర్గాలతోనూ ఆయన చర్చలు జరిపారు. అయినా సమస్య కొలిక్కి రాలేదు. దాంతో టికెట్ ఖరారు విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఆయన వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ టికెట్ శిల్పా మోహన్ రెడ్డికి ఇస్తే నంద్యాలలో తమ అభ్యర్థిని పోటీకి దించాలని జగన్ ఆలోచిస్తన్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కూడా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.ఆపార్టీనుంచి గంగుల ప్ర‌తాప్‌రెడ్డిని పోటీలో నిల‌పాల‌ని జ‌గ‌న్ భావించిన నేప‌థ్యంలో పార్టీలో అస‌మ్మ‌తి నెల‌కొంది.ఈ స్థితిలోనంద్యాల వైసీపీ ఇన్‌ఛార్జ్‌ రాజగోపాల్‌రెడ్డి గొంతు పెంచారు. ఆయనకు జిల్లా వైసీపీ ఇన్‌ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి మద్దతు పలికారు. దీంతో గంగుల ప్రతాపరెడ్డి వర్గానికి చిక్కులు తలెత్తాయి.దీంతో వైసీపీకి కూడా న‌ష్టం త‌ప్ప‌ద‌న్న భావ‌న ఏర్ప‌డింది.
శిల్పా మోహన్ రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానంద రెడ్డి పేరు తెర మీదికి వచ్చింది. అంతేకాకుండా బనగానపల్లె నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి స్వయాన అల్లుడు. దానివల్ల భూమా బ్రహ్మానందరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కూడా కీలకంగా మారాడు. దీంతో బ్రహ్మానంద రెడ్డిని ఎమ్మెల్యేగా చేసేందుకు కర్నూలు జిల్లా టీడీపీ, వైసీపీ నేతలు రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
గ‌తంలో బ్రహ్మనందరెడ్డి ఎన్నికను ఏకగ్రీవం చేసే ప్రతిపాదనను మంత్రి అఖిలప్రియ వర్గానికి చెందిన నేతలు చంద్రబాబు ముందు పెట్టినట్లు తెలుస్తోంది.ఆయ‌న సానుకూలంగా స్పందించ‌డంతో..మంత్రి అఖిలప్రియ, కాటసాని రామిరెడ్డి ఈ విషయంపై రహస్య చర్చలకు తెరలేపారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కాటసాని రామిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. పోటీ పడుతామని జగన్ ప్రకటించడంతో కాటసాని రామిరెడ్డి మరో మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.

{loadmodule mod_custom,GA2}

ఇక్క‌డ‌నే ఏక‌గ్రీవం కోసం చ‌క్రం తిప్పారు. భూమా బ్రహ్మానంద రెడ్డిని ఏకగ్రీవం చేసే విష‌యంపై కాటసాని రామిరెడ్డి జగన్ తల్లి విజయమ్మతో మాట్లాడినట్లు తెలుస్తోంది. దానికి విజయమ్మ సానుకూలంగా ప్రతిస్పందించినట్లు తెలుస్తోంది. దీనిపై జగన్‌తో కూడా మాట్లాడి ఏ విషయమూ త్వరలో చెప్తానని వైయస్ విజయమ్మ చెప్పినట్లు సమాచారం. విజయమ్మ జగన్‌ను ఒప్పిస్తే నంద్యాల ఏకగ్రీవం కావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ వర్గాలే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి.ఏక‌గ్రీవం అయితే ఇందులో కీల‌క పాత్ర విజ‌య‌మ్మ‌దేనిని చెప్ప‌వ‌చ్చు.
ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.అస‌లు స‌మ‌స్య ఇప్పుడే మొద‌లు కానుంది.విజ‌మ్మ మాట‌ను జ‌గ‌న్ ఒప్పుకుంటారా అన్న ప్ర‌శ్న ఇప్పుడు అంద‌రిని వేధిస్తోంది.భూమా బ్రహ్మానంద రెడ్డికైతే ఆయన అంగీకరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. భూమా వర్గీయులతో ఉన్న సన్నిహత సంబంధాల కారణంగానే కాకుండా రాజకీయంగా కోణంలో ఆలోచించినా ఆయన దానికి అంగీకరించవచ్చునని అంటున్నారు.
వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి జగన్‌తో ఈ విషయంపై ఎప్పుడు చర్చిస్తారు? దానిపై జగన్ స్పందన ఎలా ఉంటుంది? అనే అంశమే టీడీపీ, వైసీపీలో చర్చనీయాంశమైంది. చూద్దాం ఈ పరిణామం వచ్చే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -