Thursday, May 16, 2024
- Advertisement -

చంద్రబాబు కి ఒళ్ళు మండే మాట

- Advertisement -

కొంతమంది ఏమన్నా కామెంట్ చేసినా జనం పెద్దగా పట్టించుకోరు , కొంతమంది ఏమైనా అంటే సీరియస్ గా స్పందిస్తారు .. కొంతమంది ఏమైనా అంటే అలోచించి అన్నారు లే అనుకుంటారు. కొందరు నేతల దగ్గర ఒక్కొక్క మాట అసలు అనకూడదు. జగన్ దగ్గర లక్ష కోట్లు అంటే కోపమొస్తుంది. చంద్రబాబు దగ్గర అమరావతి అభివృద్ధి పేరు చెప్తే మండుతుంది. కెసిఆర్ దగ్గరకి వెళ్లి ఫాం హౌస్ లోనే ఉంటున్నారు అంటే కోప్పడతారు. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి నచ్చావు. అయితే ప్రత్యర్ధులు మాత్రం అవే పట్టుకుని మాట్లాడతారు.

కానీ ఒక మేధావి సైతం నచ్చని మాట ఒకటి అన్నారు. అది చంద్రబాబు కి తెలిస్తే కోప్పడ్డం తధ్యం. ఇంతకీ ఆ మేధావి ప్రముఖుడు ఎవరంటారా? ప్రముఖ పాత్రికేయుడు.. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాద్. తాజాగా ఆయన ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సేకరించిన భూముల లెక్కపై విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు ఎందుకని సూటిగా ప్రశ్నించిన ఆయన.. రాజధానిని 1500 ఎకరాల నుంచి 4వేల ఎకరాల్లో  నిర్మించొచ్చని.. అది కూడా అద్భుతమైన రాజధానిని అంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ విషయం తానుచెప్పటం లేదని.. పలువురు నిపుణులు ఇదే మాటను చెబుతున్నారన్నారు. రాజధాని పేరుతో వేలాది ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ సూటిగా ప్రశ్నిస్తున్న ఆయన. కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే ఇంత భారీ భూమి అవసరం కావొచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఛత్తీస్ గఢ్ రాజధాని కోసం కేవలం రెండు వేల ఎకరాలు మాత్రమే సేకరించిన విషయానని వెల్లడించిన పాలగుమ్మి మాటలు వింటే ఏపీ ముఖ్యమంత్రికి కోపం రావటం ఖాయం. అయితే.. పాలగుమ్మి మాటల్లో ఒక మాట కాస్త తేడా కొట్టిందని చెప్పాలి. రైతుల నుంచి భూమిని బలవంతంగా సేకరించారన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. చాలా తక్కువ భూమి విషయంలో తప్పించి.. రాజధాని కోసం సేకరించిన ఈ భారీ భూసేకరణకువ్యతిరేకత రాలేదన్న విషయం ఆయన దృష్టికి వచ్చినట్లుగా కనిపించలేదు. ఈ విషయాన్ని ఆయన కాస్త కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -