Sunday, May 19, 2024
- Advertisement -

‘సింధు’ ని చూసి ఏమి నేర్చుకోవాలి

- Advertisement -

సింధు సాధించిన వెండి పతకంతో భారతీయులందరు మురిసిపోయారనేది ముమ్మాటికీ నిజమే…!  గెలిచినవాడి భుజం మీద చెయ్యి వేసి వీడు మా వాడే అని విర్రవీగి చెప్పే వెర్రి వెంగలప్ప ప్రభుత్వాలు

ఈ ఘటన నుండి ఏమి నేర్చుకున్నాయి అతి ఉత్సాహం ప్రదర్శించి ప్రజల సొమ్ముని ప్రసాదం లా పంచే హక్కు యాడ ఉంది ( అన్ని కోట్లా ) అంత ఆనందం పట్టలేకుంటే పార్టీ నిధుల్లోనుంచో మీ జేబు లోనుంచి ఇవ్వండి సంతోషిస్తాం మీరు చేయవల్సిందీ , సింధు కి కోట్లు రూపాయలు , కోట్లరూపాయల విలువ చేసే స్థలాలు కాదండి( అది జనం కష్టార్జితం ) సింధూ లాంటి అమ్మాయిలని ఎలా తాయారు చేయాలి ,అందుకు మీ గవర్నమెంటులు ఏం చేయబోతున్నాయో ఏ క్రీడావిధానం అమలుచేస్తారు ?? చెప్పండి !! స్కూల్లో పిల్లలు ఆటలు ఆడినందుకు పరీక్షల్లో మార్కులు కలపండి Play ground లేకపోతే PT సర్ లేకుంటె స్కూల్ మూసేయించండి టైం టేబుల్ లో ఒక్క పీరియడ్ అయినా సరే పిల్లలు ఆటలు ఆడవల్సిందే అని హుకుం జారీ చేయండి Playing Kits , అన్ని స్కూల్స్ కు ఉచితంగా ఇవ్వండి ( ఇవి ఇవ్వటానికి డబ్బు ఉండదేం ). Olympics గాదు ముందు లోకల్ టోర్నమెంట్సు ,ఆడించండి లోకల్ టాలెంటెడ్ ‘ సింధూ ‘ లు చాలా మంది ఉన్నారు ,; పాపం ఈ విద్యావిధానాల వలన ఇంటా ,బయట , స్కూల్లోనూ ప్రతి క్షణం ,చదువు,చదువు , పరీక్షలు, మార్కులు ,అని ఒకటే బెంగతో ఇటు తల్లితండ్రులు ,అటు పిల్లలు Class rooms లోనే ,homeworks తో మగ్గి పోతున్నారు ,  వారంతా , ఒక్కసారిగా ,మైదానంలో అడుగిడితే ,ప్రపంచంలో భారతీయులవే పధకాలు….    చిన్న  చిన్న  దేశాలు  మన కన్నా  ఎక్కువ  ఫలితాలు  సాధించారు…  అమెరికా  ఇరగదీసింది… అనేక దేశాలు పలు క్రీడాంశాల్లో  ముందున్నరు  మనకు ఏమైంది ? అమ్మా ‘ సింధూ ‘ నీ విజయాన్ని తక్కువ చేయటానికి కాదమ్మా మేం.. అంటున్నది ఈ మాత్రం చలనం కలిగించావు అందుకు

నీకు జే జే లు ఎప్పటికప్పుడు రాజకీయాలు  ఆడేకేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ,విద్యా ,క్రీడా విధానాలపైనే నా ఆవేదన… కీర్తిపతాకను ఎగురవేసిన క్రీడాకారిణి కి స్వాగతించడానికి మహారాష్ట్ర  బస్సుదిక్కయింది.. మనకు ఒక బస్సు సౌకర్యం లేకపోవడం  విచారకరం…  130 కోట్ల జనాభా ఉంది చేయూతనివ్వండి , ఒకొక్క క్రీడకి శత వీరులు సిద్ధమవుతారు….. జయహో భారత్ !!  జయహో !!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -