Thursday, March 28, 2024
- Advertisement -

విశాఖలో పీవీ సింధు అకాడమీకి 2 ఎకరాల భూమి.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు

- Advertisement -

భారత బ్యాడ్మింటన్ ధృవతార పీవీ సింధుకు ఏపీ సర్కారు గతంలోనే 2 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ భూమికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖ రూరల్ మండల్ చినగాదిలి వద్ద 2 ఎకరాల భూమిని పీవీ సింధుకు కేటాయిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ భూమి పశుసంవర్ధక శాఖకు చెందినది కాగా, పీవీ సింధుకు అందించేందుకు వీలుగా, దాన్ని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు బదలాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు.

ఇదిలా ఉంటే గతంలతో తనకు భూమిని కేటాయిస్తే బ్యాడ్మింటన్ కోచింగ్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్ నెలకొల్పుతానని.. తనలా ఎంతో మంది ఔత్సాహిక క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉండేలా పీవీ సింధు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా, పీవీ సింధు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ రంగంలో సాధించిన ఘనతలకు గుర్తింపుగా ఏపీ సర్కారు… విశాఖలోని చిన గాదిలి వద్ద స్థలాన్ని ఉచితంగా అందించాలని నిర్ణయించింది.

ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ప్రకటించిన నేపథ్యంలో, క్రీడల హబ్ గానూ ఈ తూర్పుతీర నగరాన్ని అభివృద్ధి చేయాలని సర్కారు భావిస్తోంది. ప్రతిభ కలిగిన పేదల పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

300 ఎన్ కౌంటర్లు చేసిన మాజీ పోలీసు అధికారి ప్రదీప్ శర్మ అరెస్ట్!

ఒక్కటవుతున్న రష్మీ, అనసూయ.. క్రేజి ప్రాజెక్టుకు సై!

ఇద్దరు పెద్ద హీరోలతో శ్రీనువైట్ల మల్టీ స్టారర్​..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -