Saturday, May 18, 2024
- Advertisement -

పాక్‌.చైనా స‌రిహ‌ద్దులో మోహ‌రించ‌నున్న ఎస్‌-400 యంటీ మిస్సైల్ వ్య‌వ‌స్థ‌

- Advertisement -
Russia Readying to Supply S-400 Anti-Aircraft Missile Systems to india

భార‌త వాయిసేన మ‌రింత బ‌లోపేతం కాబోతోంది.భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ర‌ష్యాతో భార‌త్ బంధం మ‌రింత ప‌టిస్టం కానుంది.భార‌త ఆర్మీలోకి అత్యాధునిక ఎస్-400 ‘ట్రయమ్ఫ్’ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్స్ రష్యా నుంచి రాబోతున్నాయి.దీనికి సంబంధించిన ప్రీ కాంట్రాక్ట్ ఏర్పాట్లు జరుగుతున్నాయని రష్యా ఉప ప్రధాని దిమిత్రి రొగొజిన్ చెప్పారు.

గ‌త ఏడాది భార‌త్‌తో ర‌ష్యా సుమారు 60 వేల కోట్ల విలువైన ర‌క్ష‌ణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న‌ది. దానిలో భాగంగానే ఎస్‌-400 మిస్సైల్ వ్య‌వ‌స్థ‌ను స‌ర‌ఫ‌రా చేయ‌నున్న‌ది. విభిన్న త‌ర‌హా వైమానిక ఆయుధాల‌తో చేసే దాడుల‌ను ఎస్‌-400 ట్రింఫ్ స‌మ‌ర్థంగా తిప్పికొట్ట‌గ‌ల‌దు. స్ట్రాట‌జిక్‌, బాలాస్టిక్‌, హైప‌ర్‌సోనిక్ మిస్సైళ్ల‌ను ఎస్‌-400 ఎదుర్కుంటుంది. అత్యంత ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన అయిదు సిస్ట‌మ్స్‌ను భార‌త్ కొనుగోలు చేస్తుంది.
ఎస్-400 నవ తరం యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్. 400 కి.మీ., 250 కి.మీ., 120 కి.మీ. దూరాల్లోని లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణులను ఈ వ్యవస్థకు అనుసంధానం చేయవచ్చు. వీటిని పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో మోహరించే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇటువంటి వ్యవస్థ సిరియాలో ఉంది. ఇస్లామిక్ స్టేట్‌ను నిలువరించేందుకు రష్యా వీటిని ఉపయోగిస్తోంది.

{loadmodule mod_custom,GA2}

వాయిసేన బ‌లోపేతం కోసం క‌మోవ్ 226టీ హెలికాప్ట‌ర్ల‌ను కూడా ర‌ష్యా నుంచి భార‌త్ కొనుగోలు చేయ‌నున్న‌ది. కాలం చెల్లుతున్న చీతా, చేత‌క్ హెలికాప్ట‌ర్ల స్థానంలో క‌మోవ్ హెలికాప్ట‌ర్ల‌ను వాడ‌నున్నారు.వీటితో భార‌త్ ఆర్మీ,వాయిసేన బ‌లోపేతం కానున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -