Saturday, May 4, 2024
- Advertisement -

బాబు డూప్ హోటల్లో…. మోదీ డూప్ ఫాస్ట్‌పుడ్ సెంట‌ర్లో….

- Advertisement -

మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అప్పుడప్పుడు మనకొక డైలాగ్ వినిపిస్తుంటుంది. అది ఎంతవరకు నిజమో చెప్పలేము గాని కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉండే వ్యక్తిని మరోచోట చూసినట్లు అనిపిస్తుంది. ఇకపోతే వర్మ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో కూడా అందరికి అలాంటి ఆలోచనను కలిగించింది.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పిన వర్మ వెంటనే చంద్రబాబు లా కనిపిస్తున్న ఒక వ్యక్తి వీడియో పోస్ట్ చేశాడు. ఆ చిన్న ఫుటేజ్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఒక హోటల్ లో సర్వర్ లో కనిపిస్తున్న అతన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మొదట వర్మ వీడియో పోస్ట్ చేయగానే మార్ఫింగ్ చేసిందని అంతా అబద్దమని టాక్ వచ్చింది. అయితే కొంతమంది నెటిజన్స్ అతనికి సంబందించిన మరిన్ని వీడియోలను పోస్ట్ చేయగా వర్మ చెప్పింది నిజమే అన్నట్లు తేలింది. ప్రస్తుతం ఆ వీడియో కూడా ఇంటర్నెట్ లో ట్రేండింగ్ గా మారింది.

ఇప్పుడు ప్రధాని మోదీ వంతు వచ్చింది. అచ్చం ఆయన మాదిరే ఉన్న వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మోదీని పోలిన వ్యక్తి టీషర్ట్ ధరించి, మంచూరియా తయారు చేస్తున్నాడు. అయితే ఈ వ్యక్తి పేరు కానీ, వివరాలు కానీ తెలియరాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -