- Advertisement -

వామన్‌రావు హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌.. ఆందోళనకు దిగిన అడ్వకేట్లు..!

- Advertisement -

హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కోర్టుల ముందు న్యాయవాదులు ఆందోళనకు దిగారు. నిందింతులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమండ్‌ చేస్తూ మల్కాజిగిరి కోర్టులో వద్దా ధర్నా నిర్వహించారు న్యాయవాదులు. మల్కాజ్‌గిరి కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నాకు దిగారు. ఉప్పర్‌పల్లి కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించారు.

సికింద్రాబాద్ సివిల్ కోర్టు న్యాయవాదులు ధర్నా చేశారు. కేసులను వాదిస్తున్న న్యాయవాదులకు తెలంగాణలో రక్షణ లేదని ప్రభుత్వం వెంటనే రిస్క్ ఉన్న న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వెంటనే ఈ కేసును సి.బి.ఐ కి అప్పగించి వామనరావు దంపతుల హత్యపై నిస్పాక్షికంగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

పెద్దపల్లి జిల్లాలో న్యాయవాదుల హత్యను ఖండిస్తూ మంథనిలో బంద్‌ ప్రకటించారు. ఈ హత్యలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి… ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

రామ్ చరణ్, శంకర్ సినిమా కథ ఎలా ఉండబోతుందంటే..?

అభిమానుల ప్రేమకు పొంగిపోతున్న నిధి అగర్వాల్

హైకోర్టు న్యాయవాది దంపతులు దారుణ హత్య.. స్పాట్ కి ఐజీ..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -