- Advertisement -

ప్రియుడికి బైక్ కొనివ్వడానికి.. చోరీ చేసిన యువతి!

- Advertisement -

తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా పొళ్లాచ్చిలో ప్రేమ కోసం ఓ యువతి దారి తప్పుతూ దొంగిని తలపించిన ఘటన వెలుగు చూసింది. తన ప్రియుడి కోరిక తీర్చడం కోసం ఏకంగా కన్న స్నేహితురాలి ఇంట్లోనే బంగారు నగలు కాజేసింది. ఆ సొమ్ముతో ప్రియుడికి ఖరీదైన బైక్ కొనిచ్చి కటకటపాలైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొళ్లాచ్చికి చెందిన 19 ఏళ్ల ఆర్. జాయ్‌ ప్రిన్సీ స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీకాం రెండో ఏడాది చదువుతోంది. ఈ క్రమంలో ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఎలాగైనా తన ప్రియుడికి ఒక మంచి బైక్ బహుమతిగా ఇవ్వాలని ఆమె భావించింది. అయితే అందుకు తగినంత డబ్బు లేకపోవడంతో షార్ట్ కట్ మార్గాన్ని ఎంచుకుంది. తన స్నేహితురాలి ఇంట్లోనే చోరీ చేయాలని పథకం వేసింది.

గత ఆగస్టు 16వ తేదీన జాయ్ ప్రిన్సీ తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. అందరూ ఉన్న సమయంలో కాస్త సమయం చూసి బీరువాలో భద్రపరిచిన తొమ్మిది సవర్ల బంగారు నగలను ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత ఆ బంగారాన్ని బయట విక్రయించి నగదుగా మార్చుకుంది. వచ్చిన డబ్బుతో రూ. 2.50 లక్షల విలువైన సరికొత్త లగ్జరీ బైక్‌ను కొనుగోలు చేసి తన ప్రియుడికి కానుకగా ఇచ్చింది.

మరోవైపు ఇంట్లో బంగారు నగలు గైర్హాజరు కావడంతో స్నేహితురాలి తండ్రి తమిళ్ సెల్వన్ వెంటనే పొళ్లాచ్చి నార్త్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, అనుమానాస్పదంగా తిరుగుతున్న జాయ్ ప్రిన్సీని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో ఆమె అసలు నిజం బయటపెట్టింది. స్నేహితురాలి ఇంట్లో తానే నగలు దొంగిలించినట్లు, ఆ డబ్బుతోనే ప్రియుడికి బైక్ కొనిచ్చినట్లు అంగీకరించింది. ప్రస్తుతం ఈ ఘటనకు కారణమైన యువతిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -