Tuesday, May 21, 2024
- Advertisement -

ఏపీలో 20 వరకు కర్ఫ్యూ పొడగింపు!

- Advertisement -

గత రెండు నెలల నుంచి ఏపిలో కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కర్ఫ్యూ విధించారు. ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. అయితే.. పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. 10న కర్ఫ్యూ గడువు పూర్తి కానుండడంతో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కర్ఫ్యూ అమలుపై అధికారులతో నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కేసులు మరింత తగ్గే వరకు కర్ఫ్యూ కొనసాగించడమే మంచిదని సమావేశంలో నిర్ణయించారు.

కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూపై ఆంక్షలు సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ ను జూన్‌ 20 వరకూ పొడిగించింది. జూన్‌10 తర్వాత కర్ఫ్యూ సమయాల్లో పొడిగింపు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూను సడలింపు ఉంటుందని వెల్లడించింది. ప్రభుత్వ కార్యాలయాలు ఉ.8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు పని చేస్తాయని వెల్లడించింది.

కరోనాను పూర్తిగా నియంత్రించాలని సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల పరిస్థితిపై అధికారులు సీఎం జగన్ కు నివేదికలు సమర్పిస్తున్నారు. కర్ఫ్యూను పొడిగించి.. సడలింపుల విషయంలో కొన్ని మార్పులు చేయడం బెటర్ అని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ఒక్క మామిడి పండు ధర రూ. 1000 .. అంత స్పెషల్​ ఏమిటీ అంటారా?

మాస్కు పెట్టుకుంటే ఫైన్​.. ఇదెక్కడి విడ్దూరం..!

కేజిఎఫ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. అసలు నిజం?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -