మాస్కు పెట్టుకుంటే ఫైన్​.. ఇదెక్కడి విడ్దూరం..!

- Advertisement -

కరోనా ఎఫెక్ట్​తో ప్రపంచ దేశాలన్నీ మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరికి మాస్కు ఓ నిత్యావసరంగా మారిపోయింది. ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు మాస్కులు ఉంటున్నాయి. ఇక ఆసక్తి ఉన్నవాళ్లు మ్యాచింగ్​ మాస్కులు కూడా తయారుచేయించుకుంటున్నారు అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఒక చోట మాస్కు పెట్టుకుంటే ఫైన్​ విధిస్తున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.

అమెరికాలో కరోనా లాక్​డౌన్​ ఆంక్షలు క్రమంగా సడలించిన విషయం తెలిసిందే. అక్కడ ఇప్పటికే మాస్కు తప్పనిసరి అనే నిబంధనను తీసేశారు. అయితే కొంత మంది ముందు జాగ్రత్త కోసం, మరికొందరు అలవాటు ప్రకారం మాస్కులను ధరిస్తున్నారు. ఇదిలా ఉంటే కాలిఫోర్నియాలో ని ఓ కేఫ్​ వినూత్న నిబంధన విధించింది. మా కేఫ్​కు ఎవరైనా మాస్కు ధరించి వస్తే.. ఐదు డాలర్లు ఫైన్​ విధిస్తామంటూ ప్రకటించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఫిడిల్‌హెడ్స్ అనే ఓ కేఫ్ ఉంది. ఈ కేఫ్​లో నోటిసుబోర్డులో ఇలా రాశారు.

- Advertisement -

Also Read: కోవాగ్జినా.. కోవిషీల్డా ఏది బెటర్​? ఇదిగో ఆన్సర్​

ఎవరైనా మాస్కులు ధరించి మాకు ఆర్డర్లు ఇస్తే 5 డాలర్లు ఫైన్​ విధిస్తాం. అంతేకాక.. వ్యాక్సిన్​ వేయించుకున్నాం అని పక్కవాళ్లకు చెప్పినా ఈ ఫైన్​ వర్తిస్తుంది’ అంటూ రాశారు. దీంతో కస్టమర్లు ఖంగుతిన్నారు. ఇదేంటి మాస్కు ధరిస్తే ఫైన్​ ఎందుకు విధిస్తారు? అంటూ ఆరా తీశారు. అయితే అసలు విషయం ఏమిటంటే? సదరు కేఫ్​ యజమాని సేవా కార్యక్రమాలు చేసేందుకు ఇలా వినూత్నంగా ఫైన్లు విధిస్తున్నాడు. ఇక్కడ ఫైన్​గా చెల్లించిన మొత్తాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు పంపిస్తున్నాడు. దీంతో చాలా మంది మాస్కులు పెట్టుకొని మరీ ఫైన్​ లు కడుతున్నారట. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం వైరల్​గా మారింది.

Also Read: పోలీసు కాళ్లమీద పడ్డ రైతన్న..! ఎందుకంటే?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -