Thursday, May 16, 2024
- Advertisement -

వైసీపీపై కుట్ర.. జరుగుతోందా ?

- Advertisement -

ఏపీలోని అధికార వైసీపీ పై కుట్ర జరుగుతోందా ? మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలలో ఆంతర్యం ఏమిటి ? ఇంతకీ ఎవరు కుట్ర చేస్తున్నారు.. ఎందుకు కుట్ర చేస్తున్నారు ? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం ఏపీ పోలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో కుట్ర జరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు పన్నాగలు పన్నుతున్నారని ఆయన బొత్స వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే దానిపై పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న దాని ప్రకారం.. ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ తో పాటు టీడీపీ, జనసేన పార్టీలు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. .

అధికార పార్టీ తమ పారదర్శిక పరిపాలను ప్రజలకు చూపిస్తూ సానుకూలత కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు టీడీపీ, జనసేన పార్టీలు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా జగన్ సర్కార్ లో దారుణమైన రోడ్ల దుస్థితి, విపరీతమైన పన్నుల భారంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది తరచూ వినిపించే విమర్శ.. ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియాల్లోనూ ఇదే అంశాలపై జగన్ సర్కార్ పై వేలెత్తి చూపిస్తుంటారు. ఈ వ్యతిరేకత ను మరింత గా ప్రజల్లోకి తీసుకెళుతూ లబ్దిపొందేందుకు టీడీపీ, జనసేన పార్టీలు ప్రయత్నిస్తున్నాయనేది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.

నిజానికి ప్రజల్లో వైసీపీ పై ఎలాంటి వ్యతిరేకత లేదని అదంతా ఎల్లో మీడియా సృస్టిస్తున్న బూటకపు వార్తలని వైసీపీ నేతలు చెబుతూ ఉంటారు. ఇలా లేని వ్యతిరేకతను అనవసరంగా ప్రజలపై రుద్దుతూ వైసీపీని ప్రజల నుంచి దూరం చేసేందుకే టీడీపీ, జనసేన, ఎల్లో మీడియా చూస్తుందని, ఇదంతా కూడా వైసీపీ పై జరుగుతున్నా కుట్ర అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే నిజంగానే ఇదంతా వైసీపీ పై ఎల్లో మీడియా సృష్టిస్తున్న వ్యతిరేకత నా ? లేక వాస్తవంగానే జగన్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందా అనేది వచ్చే ఎన్నికల్లో ప్రజా నిర్ణయాన్ని బట్టి తెలిసిపోతుందనేది రాజకీయవాదుల నుంచి వినిపిస్తున్న మాట.

ఇవి కూడా చదవండి

వన్స్ మోర్ జగన్.. 2024 ?

పొత్తులపై జనసేన క్లారిటీ..

టార్గెట్ సి‌ఎం పదవి.. బీజేపీ ఓపెన్ ఆఫర్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -