Tuesday, April 30, 2024
- Advertisement -

వన్స్ మోర్ జగన్.. 2024 ?

- Advertisement -

ఏపీలో ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండడంతో అధికార వైసీపీ ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని జగన్ గట్టి పట్టుదలగా ఉన్నారు. కేవలం విజయం మాత్రమే సరిపోదని 175 స్థానాల్లో కూడా విజయకేతనం ఎగురవేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. దీంతో అందుకు తగ్గట్టుగానే వ్యూహరచ చేస్తూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. పార్టీలో ఇప్పటికీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. జిల్లా స్థాయిలోని అధ్యక్షులలో, కో ఆర్డినేటర్ లలో కీలక మార్పులు చేసిన జగన్, అధికారుల విషయంలో కూడా ఆయా శాఖల్లో బదలీలు చేసి ఎన్నికలకు దారులు క్లియర్ చేసుకుంటున్నారు. .

ఇదిలా ఉండగా వైఎస్ జగన్ దూకుడు చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా జగన్ వచ్చే ఎన్నికల్ల అధికారం చేపట్టడంతో పాటు 175 స్థానాల్లో విజయం సాధించాలంటే అంతా ఈజీ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టి సంపూర్ణగా వైసీపీ పై ఉండాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం సులువౌతుంది. అందుకే నిత్యం ప్రజల్లో ఉండే విధంగా నేతలకు సూచిస్తున్నారు సి‌ఎం జగన్. నేతలు కూడా ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి మంచి పనుల గురించి వివరిస్తూ పార్టీకి మైలేజ్ తెచ్చే పనిలో బిజీగా ఉన్నారు.

ఇక గత ఎన్నికల ముందు ” రావాలి జగన్.. కావాలి జగన్ ” అనే నినాదం ప్రజల్లో బాగా మైలేజ్ తీసుకురావడంతో పాటు ప్రజల దృష్టి జగన్ పై పడేలా చేసింది. అదే విధంగా ఈసారి కూడా ప్రజలను ఆకర్శించేందుకు “: వన్స్ మోర్ జగన్.. విన్ జగన్ ” అనే నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నారు వైసీపీ నేతలు. జగన్ ప్రవేశ పెట్టిన చాలా పథకాలతో లబ్ది పొందిన వారు వన్స్ మోర్ జగన్ అనే నినాదానికి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక అడపా దడపా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మరుచుకోగలిగితే జగన్ నిర్దేశించుకున్న ” వై నాట్ 175 ” టార్గెట్ పెద్ద కష్టమేమీ కాదనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. మొత్తానికి 2024 లో మరోసారి అధికారం చెప్పటాడానికి జగన్ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. మరి ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

టార్గెట్ సి‌ఎం పదవి.. బీజేపీ ఓపెన్ ఆఫర్ !

ఏపీలో బి‌ఆర్‌ఎస్ .. ఎవరికి ముప్పు ?

జగన్ను ప్రశ్నించడమే నేరమా.. ఎందుకీ దాడులు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -