Monday, April 29, 2024
- Advertisement -

పొత్తులపై జనసేన క్లారిటీ.. త్వరలోనే అన్నీ వివరాలు !

- Advertisement -

ప్రస్తుతం ఏపీలో జనసేన అత్యంత దూకుడుగా వ్యవహరిస్తోంది. గతంలో పోలిస్తే ప్రస్తుతం పార్టీ అన్నీ విధాలుగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. ప్రభుత్వ వైఫల్యాలపై నిత్యం గళం విప్పుతూ ప్రజల దృష్టి జనసేనపై ఉండేలా చూస్తున్నారు పవన్. దాంతో అధికార వైసీపీ జనసేన మద్య పచ్చ గట్టి వేస్తే బగ్గుమనెంతలా పోలిటికల్ వార్ కొనసాగుతోంది. ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోన్న జనసేనను నిలువరించేందుకు పవన్ చంద్రబాబు దత్త పుత్రుడని, జనసేన, టీడీపీ మద్య రహస్య సంబంధం ఉందని వైసీపీ నేతలు జనసేనపై విమర్శలు గుప్పిస్తుఉంటారు. కాగా పొత్తుల విషయంలో పవన్ బీజేపీతో అధికారిక సంభందం కొనసాగిస్తున్నారని అందరికీ తెలిసిందే.

కానీ టీడీపీతో కూడా జనసేన పొత్తు ఉంటుందనేది తరచూ పోలిటికల్ సర్కిల్స్ లో వినిపించే వాదన. అయితే టీడీపీతో పొత్తు విషయంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు పవన్. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చిలనివ్వమని అందుకోసం పొత్తులకు కూడా తాము సిద్దమని పవన్ గతంలో వ్యాఖ్యానించారు. అయితే ఆ తరువాత చోటు చేసుకున్నా పరిణామాలు పవన్ పొత్తు ఎటువైపు అనేది క్లారిటీ లేకుండాపోయింది. విశాఖ ఘటన తరువాత జనసేనాని తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడంతో ఇరు పార్టీల మద్య సయోధ్య కుదిరిందనే వార్తలు వినిపించాయి. కానీ అప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో పవన్ దారి ఎటువైపు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

కాగా విశాఖలో మోడి భేటీ తరువాత మోడి పాలనపై పవన్ ప్రశంశల వర్షం కురిపించడం.. ఆ తరువాత ఒక్క ఛాన్స్ అంటూ నినాదం అందుకోవడంతో పొత్తుల విషయంలో పవన్ వైఖరి ఏంటి అనేది అంతు చిక్కని ప్రశ్నలాగే మిగిలిపోయింది. ఇదిలా ఉంచితే తాజాగా పొత్తులపై కీలక విషయాలు వెల్లడించారు జనసేన పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ నాదెండ్ల మనోహర్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసే పొత్తుల విషయంలో త్వరలోనే ప్రకటన ఇస్తామని చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని చెబుతూ ఏ పార్టీతో కలవబోతున్నామనేది త్వరలోనే వెల్లడిస్తామని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. దీంతో జనసేన పొత్తు బీజేపీతోనే కొనసాగుతుందా లేదా టీడీపీ వైపు వెళుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ టీడీపీ పొత్తు జనసేన కోరితే బీజేపీ కి దూరం కాక తప్పదు. అలా కాకుండా కేవలం బీజేపీతోనే పొత్తు కొనసాగిస్తే జనసేనకు వచ్చే ఉపయోగం ఏది లేదు. అందువల్ల పొత్తులపై పవన్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనేది పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా నడుస్తున్న చర్చ.

ఇవి కూడా చదవండి

ఏపీలో బి‌ఆర్‌ఎస్ .. ఎవరికి ముప్పు ?

కే‌సి‌ఆర్ చుట్టూ బిగుస్తున్నా ఉచ్చు.. !

బాబు, పవన్ ఇద్దరు.. జగన్నే నమ్ముకున్నారా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -