రెజినాలో ఆ యాంగిల్ చూసి.. చాన్స్ ఇచ్చిన డైరెక్టర్

Krishna Vamsi Praised Regina For Her Acting Skils

టాలీవుడ్ లో దర్శకుడు కృష్ణవంశీ కి ఎలాంటి గుర్తింపు ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.  “గులాబీ”, “ఖడ్గం”, “నిన్నే పెళ్ళాడతా” వంటి కొత్త తరహ సినిమాలు తీసి.. తెలుగు ప్రేక్షకులకు అందించాడు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ఇది ఇలా ఉంటే ఈయన ఈ మధ్య వరస ప్లాప్‍లతో డీలా పడ్డాడు.

కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ మరియు సాయి ధరం తేజ్ హీరోలుగా వస్తున్న చిత్రం “నక్షత్రం”. ఈ మూవీపై కృష్ణవంశీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు ఈ టీజర్ విపరీతంగా నచ్చేసింది. కృష్ణవంశీ తాజాగా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ “ఆ హీరోయిన్ లో నా భార్యను చూశాను అని అన్నారు”. ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అని అనుకుంటున్నారా.. ఎవరో కాదండీ హాట్ బ్యూటీ రెజినా కేసండ్రే.

{loadmodule mod_custom,Side Ad 1}

ఇక “నక్షత్రం” సినిమా గురించి తెలుసుకుంటే పోలీసు అవ్వాలనుకునే ఒక కుర్రాడు చుట్టూ ఈ కథ తిరుగుతుందని అన్నారు కృష్ణ వంశీ. ఆయన రెజినా క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ” ఆమెతో పని చేస్తున్న మొదటి రోజు నుండి నాకు ఆమెలో యంగ్ రమ్యకృష్ణ కనబడిందని ఆమెలో ఆ యాంగిల్ నచ్చి ఆమె పాత్ర మరింత అద్భుతంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఇది ఇలా ఉంటే రెజినాలో కృష్ణవంశీ రమ్యకృష్ణను చూశాను అనడం ఆశ్చర్యంగా ఉన్నా ఆమె అభినయం చూశారా లేక అందాన్ని చూశారా అని మాత్రం క్లారిటీగా చెప్పలేదు. ఏది ఏమైనా ఈ సినిమాలో రెజినా పాత్రపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఎంతవరకు రెజీనా పాత్ర ఆకట్టుకుంటుందో చూడాలి. 

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}YvIQ_x-tA0Y{/youtube}

Related

  1. రెజీనా కోసం ముగ్గురు యంగ్ హీరోల ఫైటింగ్‌
  2. రెజీనాను లైంగికంగా వేధించింది ఎవరు..?
  3. ప్రతి రాత్రి రెజీనా ఎవరిని కౌగిలించుకుంటుందో తెలుసా?
  4. రెజీనా.. సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకుంది!