Saturday, May 18, 2024
- Advertisement -

ఇద్ద‌రు బాబులు బాగా బిజీ …

- Advertisement -
YS Jagan’s Delhi tour vs Chandrababu’s America tour

వైసీపీ అధినేత జ‌గ‌న్ … ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని స‌డ‌న్‌గా క‌ల‌వ‌డం రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. ఏపీ సీఎంచంద్ర‌బాబు నాయుడు రాష్ట్రంలో ఉండి ఉంటె అంత ప్రాధాన్య‌త ఉండ‌వ‌పోవ‌చ‌వ్చు.కానీ బాబు విదీశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ప్పుడే … జ‌గ‌న్ ఢిల్లీ వెల్లి ప్ర‌ధాన‌ని వ‌ల‌కడం వెనుక ఉన్న మ‌త‌ల‌బేంట‌ని చ‌ర్చించుకుంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు.

ప్రధాని మోదీతో అపాయింట్‌మెంట్ దొర‌క‌డ‌మే క‌ష్టం అనుకుంటే అలాంటిది మోదీ జ‌గ‌న్‌తో తీరిగ్గా కూర్చుని మాట్లాడాడ‌ని, జ‌గ‌న్ ప‌ట్ల చాలా సానుకూల వైఖ‌రి ప్రద‌ర్శించార‌ని పార్టీ నేత‌లు ఒకింత ఆనందాన్ని వెలిబుచ్చుతున్నారు.అయితే ఈభేటీ వెనుకు వేరే రాజ‌కీయ కార‌ణాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.వ‌చ్చె ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌తో క‌ల‌సి పోటీచేసేందుకు భాజాపా ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్న‌ట్లు స‌మాచారం. ఇది ఎంత‌వ‌ర‌క‌నేది ఎవ‌రూ ఊహించ‌ని విష‌యం.
మోదీని క‌ల‌సిన అనంత‌రం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని అడిగామ‌ని..దానితో పాటు రైతుల స‌మ‌స్య‌ల‌ను వివిరించామ‌ని తెలిపారు. వీటితోపాటు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికే పూర్తి మద్దతు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఏకగ్రీవంగా ఎన్నికైతే బాగుంటుందని జగన్ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి, మోడీతో నెయ్యానికి జగన్ ప్రాతిపదిక ఏర్పాటు చేసుకున్నారని అర్థమవుతుందని అంటున్నారు.
వీరి భేటీ వెనుకు పెద్ద ప్లాన్ ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 2019 ఎన్నిక‌ల్లో మ‌ల్లీ అధికారంలోకి రావాలంటె ముఖ్యంగా భాజాపాకు కావాల్సింది పార్ల‌మెంట్ సీట్లు.ఇప్ప‌టికే వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీచాయ‌ల‌ని భావిస్తోంది.ప‌రిస్థితులు అన‌కూలించ‌క‌పోతే కనీసం ఎక్కువ లోక్ సభ సీట్లు తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తోంది.ఇప్ప‌టికే బాబు సొంత‌స‌ర్వేలోను….ల‌గ‌డ‌పాటిస‌ర్వేలోను వైకాపా కి తెదేపా కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ఒక సర్వే చెప్పడం తో బిజెపి అలెర్ట్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది.ఒక వేల టీడీపీతో పొత్తు పెట్టుకుంటే భాజాపా అడిగిన‌న్ని సీట్లు ఇచ్చే అవ‌కాశం ఉండ‌ద‌నేది స‌త్యం. అదే వైసీపీ అయితే జ‌గ‌న్ మీద కేసులు ఉన్నాయి కాబ‌ట్టి …అడిగిన‌న్ని సీట్లు ఇస్తార‌నేది భాజాపా ప్లాన్‌గా క‌నిపిస్తోంది.

{loadmodule mod_custom,Side Ad 1}

అయితే టీడీపీ నేత‌లు మాత్రం ఈ భేటీపై అక్క‌సు వెల్ల‌గ‌క్కుతున్నారు. జగన్ కు మోడీ అపాయింట్ ఇవ్వడంపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. జగన్ ఆర్థిక నేరస్తుడు అని, అవినీతిపరుడు అని అలాంటి వ్యక్తికి అపాయింట్ మెంట్ ఇవ్వడం ఏంటని? తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. అయితే దీని వెనుక మోడీ ఎత్తుగడ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అవసరం అయితే జగన్ తో కలిసి పోటీ చేసే యోచనలో బీజేపీ ఉందని, ఈ నేపథ్యంలోనే మోడీ ఇలా చేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజ‌కీయాలల్లో శాశ్వ‌త శ‌త్రువులు…శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. అందుకే జగన్ తో పొత్తుకు కూడా ఒక తలుపు తెరిచి ఉంచాల‌ని భావించింది భాజాప‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌రిస్తితుల‌ను బ‌ట్టి రాజ‌కీయాలు మారుతూ ఉంటాయి.వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనుకోకుండా టీడీపీతో పొత్తు బెడిసి కొడ్తే … జ‌గ‌న్ తో పొత్తుకు స‌మ‌స్య‌లు ఉండ‌వ‌నేది భాజాపా వ్యూహం. మొత్తానికి మోది తో జగన్ భేటి అనేది ప్రస్తుతానికి తెదేపాని బెదిరించడానికి బిజెపి వేసిన ఎత్తుగడ అనే అనుకోవాలి.
బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌టం…. జ‌గ‌న్ మోదీని క‌ల‌వ‌డంపై రాష్ట్రంలో ఎవ‌రికి ఇష్టం వ‌చ్చ‌న‌ట్లు వారు మాట్లాడుకుంటున్నారు.బాబు అమెరికాప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉంటె…జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల‌ల్లో సెటైర్లు ప‌డుతున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -