- Advertisement -

కాంగ్రెస్ గెలిస్తే ఆయనే సీఎం..చెప్పేసిన ఖర్గే!

- Advertisement -

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ప్రధానంగా ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగియగా రెండో విడత ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే భూపేష్‌ బాఘేల్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నాలుక కరుచుకున్నారు. అయితే ఆ వెంటనే తేరుకున్న ఆయన వెంటనే మాటమార్చి హైకమాండ్‌ కోరిన వారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకొచ్చారు. భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి కావచ్చని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్ బైజ్ కూడా అన్నారు.

ఇక ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడత 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరుగగా రెండో విడత మిగిలిన 70 స్థానాలకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించకుండానే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లగా ఖర్గే…భూపేష్ పేరును సీఎంగా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -