- Advertisement -

ఏడాదిలో ఒక ఇళ్లు కట్టలేదు.. అన్ని బిల్డింగులు కడతావా బాబూ!

- Advertisement -

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. ఎన్నో హామీలు ఇచ్చి బాబు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. మరి ఇప్పటి వరకూ బాబు సాధించింది ఏమిటనే విషయం పక్కన పెట్టి ప్రస్తుతం జరుగుతున్న హడావుడిని గమనించాలి.

 రాజధాని మాస్టర్ ప్లాన్ కు సంబంధించి సింగపూర్ వారు తీసుకొచ్చిన ఫోటోలను బాబు విడుదల చేశారు.  ఏపీ నూతన రాజధాని ఎలా ఉండబోతోందో బాబు గారు ఆ ఫోటోల ద్వారా వివరించారు. ప్రపంచ శ్రేణి నగరాన్ని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పుతామని ఆయన ఆ విధంగా వివరించారు.

నిజంగా ఫోటోలు అయితే అద్భుతంగా ఉన్నాయి. గ్రాఫిక్స్ తో కూడిన డిజైన్ సూపర్ అనిపించుకొంటోంది. తెలుగుదేశం అభిమానుల ఆనందానికి అయితే అవధులే లేవు! బాబు ఆవిష్కరించిన మాస్టర్ ప్లాన్ అద్భుతంగా ఉందని వారు అంటున్నారు. మరి ఇంత వరకూ బాగానే ఉంది. డిజైన్ కూడా ఉచితంగానే సింగపూర్ వాళ్లు గీయించారని అంటున్నారు కాబట్టి.. అక్కడ వరకూ బాగానే ఉంది. మరి ఈ గ్రాఫిక్స్ లో ఉన్న బిల్డింగులను నిర్మించడం ఎలా? అసలు అది సాధ్యం అయ్యే పనేనా?! అనేదే సందేహం!

ఆ గ్రాఫిక్స్ లో ఉన్న బిల్డింగులను కట్టాలంటే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుదో కూడా క్లారిటీ లేదు. అయితే బాబు ప్రభుత్వం మాత్రం ఘనంగా ఆ ఫోటోలను విడుదల చేసింది. ఒకవైపు రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీ బడ్జెట్ వేల కోట్ల లోటుతో ఉంది. ఇలాంటి నేపథ్యంలో బాబు ఆ గ్రాఫిక్స్ లోని బిల్డింగులను ఎలా ఆవిష్కరిస్తారో చూడాలి. బాబు ఏడాది పాలనను పూర్తి చేసుకొని ఇప్పటి వరకూ కనీసం పేదవాళ్లకు ఒక్క ఇంటినీ కట్టించలేదని..  అయితే ఈ గ్రాఫిక్స్ తో మాత్రం ఏదో అద్భుతాన్ని చేయబోతున్నాననే కలరింగ్ ఇస్తున్నారని.. ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడనే అభిప్రాయాలుకూడా వినిపిస్తున్నాయి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -