- Advertisement -

భార‌త్ హిందూ స‌ముద్ర‌ జ‌లాల్లో చైనా యుద్ధ నౌక‌లు….

- Advertisement -
Chinese ships on prowl in Indian Ocean

సిక్కిం,చైనా స‌రిహ‌ద్దుల్లో గ‌త కొన్ని రోజులుగా ఉద్రిక్త ప‌రిస్థితులు తారాస్థాయికి చేరిన నూధ్యంలో ఎప్పుడు ఏంజ‌రుగుతుందోన‌న్న ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.ఇప్ప‌టికే స‌రిహ‌ద్దుల్లో ఇరు దేశాలు త‌మ బ‌ల‌గాల‌ను మోహ‌రించిచారు.అయితే ఇప్పుడు రెండు దేశాల మ‌ధ్య యుద్ధం అనివార్య‌మ‌య్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

తాజాగా చౌనా మ‌రో దుస్సాహ‌సానికి ఒడిగ‌ట్టింది.భార‌త్ హిందూ స‌ముద్ర‌జ‌లాల్లోకి త‌మ యుద్ద‌నౌక‌లు,స‌బ్‌మెరైన్‌లు చ‌క్క‌ర్లు కొట్ట‌డం తీవ్ర ప‌రిస్థితికి అద్దంప‌డుతోంది. హిందూ సముద్ర జలాల్లోని సౌత్ బ్లాక్‌ నుంచి వీటి కదలికలను భారత్ నిశితంగా గమినిస్తోంది.

ఉద్రిక్తప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇప్పుడున్న భారత్‌ 1962నాటి భారత్‌ కాదంటూ రక్షణమంత్రి జైట్లీ వ్యాఖ్యానించగా.. ఆయన ప్రకటనపై చైనా స్పందించింది. ‘జైట్లీ సరిగ్గానే చెప్పారు. 1962 కన్నా 2017నాటి భారతం భిన్నంగా ఉంది. ప్రస్తుత చైనా కూడా అప్పటి చైనా కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’ అని చైనా కూడా ఘాటుగా స్పందించింది.

{loadmodule mod_custom,GA1}

ఐవోఆర్‌లో గస్తీ కాస్తున్న ఇండియన్ నేవల్ ఉపగ్రహమైన రుక్మిణి (జీశాట్-7) గత రెండునెల్లలో ఐవోఆర్‌లో చైనాకు చెందిన 13 యద్ధ నౌకలను గుర్తించింది. వీటిలో అత్యంత శక్తిమంతమైన లుయాంగ్-3 క్లాస్ గైడెడ్-మిసైల్ డెస్ట్రాయర్ కూడా ఉన్నట్టు నావికాదళ వర్గాలు చెబుతున్నాయి.హిందూ మహాసముద్ర జల్లాల్లో చైనా జలాంతర్గామి, యుద్ధ నౌకల మోహరింపు పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

Related

  1. డ్రాగ‌న్ దేశాన్ని ఎదుర్కొనే స‌త్తా భార‌త్‌కు ఎంత‌వ‌ర‌కు ఉంది…?
  2. భార‌త్ ,చైనా మ‌ధ్య కొన‌సాగుతున్న ఉద్రిక్త‌త‌లు… మ‌రిన్ని బ‌ల‌గాల త‌ర‌లింపు..
  3. ఆర్మీఛీప్ సిక్కింప‌ర్య‌ట‌న‌లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…
  4. 30 సంవ‌త్సరాల త‌ర్వాత మొద‌టి సారిగా భార‌త్ ఆర్మీలోకి శతఘ్నులు…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -