- Advertisement -

మంత్రి కొల్లు రవీంద్రకు షాక్..తీవ్ర ఉద్రిక్తత

- Advertisement -

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ విషయమై కూటమి ప్రభుత్వంపై మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హార్బర్‌ను సందర్శించడానికి వచ్చిన రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కొల్లు రవీంద్ర కాన్వాయ్‌ను మత్స్యకార మహిళలు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది.

తమ వారి ఆచూకీ చెప్పాలంటూ మంత్రి కాన్వాయ్‌కు అడ్డుగా నిలబడిన బాధిత మహిళలను పోలీసులు బలవంతంగా పక్కకు లాగిపడేశారు. అయినప్పటికీ మంత్రి కొల్లు రవీంద్ర అక్కడ ఆగకుండా కాన్వాయ్‌తో వెళ్లిపోవడం మత్స్యకారుల ఆగ్రహాన్ని మరింత పెంచింది. గల్లంతైన మత్స్యకారులను ట్రేస్ చేయడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని, వారు ఇక లేరని మంత్రి నిర్ధారించడంపై కుటుంబ సభ్యులు గుండె లబోదిబోమంటున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై మత్స్యకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. “మాకు ఇంత పెద్ద కష్టం వస్తే ప్రభుత్వం నుంచి ఒక్కరూ వచ్చి మమ్మల్ని ఆదుకోలేదు. మా బాధను ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. మా వారు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో తెలియక మేము కన్నీరుమున్నీరవుతుంటే.. ఏ ఒక్క అధికారి కూడా మా దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పలేదు” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంతసేపూ ప్రశ్నించిన వారిని అరెస్టులు చేయించడం తప్ప.. టీడీపీ, జనసేన ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మత్స్యకారుల బాధలు పట్టవా? అసలు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకు ప్రోటోకాల్ డ్యూటీలు చేయడం తప్ప వీళ్లకు వేరే పని లేదా? అంటూ మత్స్యకార శ్రేణులు నిలదీశాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని, బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -