- Advertisement -

అఖిల్ నటనలో బాధ చూశాను: నాగార్జున

- Advertisement -

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లెనిన్’. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం జులై 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన ప్రెస్ మీట్‌లో అఖిల్, నాగార్జున సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఈ చిత్ర విడుదల తేదీలో మార్పుపై నాగార్జున వివరణ ఇచ్చారు. మంచి అవుట్‌పుట్ కోసం ప్రొడక్షన్ టీం కోరడంతోనే విడుదల తేదీని మార్చాల్సి వచ్చిందని తెలిపారు. “నేను నా కెరీర్‌లో ఏ సినిమా విడుదల తేదీ ప్రకటించినా మాట తప్పలేదు. కానీ, అఖిల్ సినిమా కోసం కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు. తండ్రిగా తన బిడ్డ బాగుండాలని కోరుకోవడంలో తప్పులేదని, నాన్నగారి ‘మనం’ సినిమా తర్వాత మళ్ళీ ఇంతలా ఈ ప్రాజెక్ట్ కోసం ఇన్వాల్వ్ అయ్యానని నాగ్ చెప్పారు. మురళీ కిశోర్ చెప్పిన కథ శ్రీరామాపురంలో జరగడం, తన తండ్రి పుట్టిన ఊరు పేరు కూడా అదే కావడంతో ఈ ప్రాజెక్ట్ తనకు సెంటిమెంట్‌గా అనిపించిందని నాగార్జున వెల్లడించారు.

‘లెనిన్’ పాత్ర తన వ్యక్తిత్వంలో ఎంతో మార్పు తెచ్చిందని అఖిల్ అన్నారు. “ఈ సినిమా కోసం మానసికంగా సిద్ధమయ్యాను. ఈ సినిమా గురించి ఇప్పుడే ఎక్కువ మాట్లాడను. జులై 10న విడుదలయ్యాక కంటెంటే మాట్లాడుతుంది” అని అఖిల్ ధీమా వ్యక్తం చేశారు. అఖిల్ నటనను చూసి తండ్రిగా చాలా మురిసిపోయానని నాగార్జున ప్రశంసించారు. అఖిల్ కెరీర్‌ను తనతో పోల్చవద్దని, ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తే ఖచ్చితంగా ‘మనం’ లాంటి క్లాసిక్ అవుతుందని నాగార్జున నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. అఖిల్ నటనలో ఒక రకమైన బాధ ఉంటుందని, అది ఈ కథకు సరిగ్గా సరిపోయిందని నాగార్జున అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో భారతి పాత్ర చిత్రానికి గుండె చప్పుడులా ఉంటుందని నాగార్జున తెలిపారు. అక్కినేని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం జులై 10న భారీ స్థాయిలో థియేటర్లలో సందడి చేయనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -